- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు తలైవా సంచలన నిర్ణయం!
సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడెప్పుడు పెడతారా అని తమిళనాడు రాష్ర్ట ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో తిరుగులేకుండా ఎదిగిన ఆయన తమిళ రాజకీయాలు శాసించడం చూడాలని ఆయన అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా తలైవా కూడా కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శనాస్ర్తాలు సంధిస్తుంటాడు. ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏకు అనుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఇక తలైవా బీజేపీలో చేరుతాడని ఫిక్స్ అయ్యారు. కానీ అందరినీ షాక్‌కు గురిచేస్తూ కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. తమిళ రాజకీయాల్లో సినిమా తెరపై నుంచి వచ్చిన అందరి కథానాయకులా, కథానాయికల రాజకీయ ప్రస్థానం విజయవంతంగా సాగింది. దీంతో తలైవాకు కూడా ఉన్నపలంగా కాకపోయిన కాస్త టైం తీసుకొనైనా తన ముద్ర తమిళ రాజకీయాల్లో వేస్తాడనేది ఆయన అభిమానుల ఊహాగానాలు. ఇప్పటికే తమిళంలో అగ్రకథానాయకుడు కమలహాసన్ పార్టీ పెట్టాడు. మరి వీరిద్దరిలో ఎవరిరాజకీయం ఎలా ఉంటుందో చూడాలి. తాజాగా రజనీకాంత్ గురువారం మరోసారి ప్రజా సంఘం రాష్ట్రవ్యాప్త కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా చెప్పి రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఆయన అభిమానుల హడావుడి మినహా రాజకీయ పార్టీని ప్రకటించిందిలేదు. అయితే తాజాగా ఆయన రాజకీయపరంగా వేగాన్ని పెంచారని చెప్పాలి. గతవారం రాష్ట్రవ్యాప్త రజనీ ప్రజాసంఘం కార్యదర్శులను చెన్నైకి రప్పించి వారితో భేటీ అయ్యారు. దీంతో రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయమని చాలామంది అనుకున్నారు. రాజకీయ వర్గాల్లోనూ కదలిక వచ్చింది. కార్యదర్శుల భేటీ అనంతరం రజనీకాంత్ చేసే ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూశారు.
ఇవాళ సమావేశానాంతరం రజనీ పార్టీని ప్రకటిస్తే అందులోకి చేరడానికి ఎదురుచూసిన కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారూ చాలానే ఉన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండడం, ఇటీవల కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరసర్ వంటి కొందరు రాజకీయ నాయకులు రజనీకాంత్‌ను కలిసి చర్చలు జరపడం లాంటి పరిస్థితుల్లో గురువారం భేటీ అనంతరం రజనీకాంత్ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన చేసిన తరువాత ఏప్రిల్ 14వ తేదీన మదురైలో భారీ మహానాడును ఏర్పాటు చేసి ఆ వేదికపై రజనీకాంత్ పార్టీ పేరును వెల్లడించాలని భావిస్తున్నట్టు అభిమాన సంఘాల సమాచారం. రజినీ ప్రజాబలం చాటుకుంటే కమలహాసన్ పార్టీ, బీజేపీ, వంటి పార్టీలు పొత్తుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే చాన్సులూ చాలానే ఉన్నాయి. దీంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల్లో పదవులు, అధికారాలు దక్కక అసంతృప్తితో ఉన్నవాళ్లు సైతం రజినీ వెంట వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గురువారం తన కార్యదర్శులతో భేటీ అనంతరం ఆయన చేసే ప్రకటన చాలా కీలకం కానుంది. ఇతర తమిళ పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
tags :super star rajinikanth, new party, Meeting of Secretaries, press meet, tamil politics, kamal haasan