- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హాస్పిటల్‌లో హీరో రజినీకాంత్.. అభిమానుల్లో టెన్షన్!

X
దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్ప్రతిలో చేరారు. ఈ మధ్యే అన్నాత్తే సినిమా షూటింగ్‌లో రజినీ పాల్గొన్నారు. అంతకుముందు సినిమా యూనిట్‌లో నలుగురికి కరోనా నిర్దారణ అయింది.
ఈ నేపథ్యంలోనే ఈనెల 22న రజినీకి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. కాగా, రజినీకి ప్రస్తుతం వైద్యులు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. తమ అభిమాన నటుడు ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 31న రజినీ తన పార్టీ పేరు, గుర్తు ప్రకటించాల్సి ఉంది.
Next Story