హైదరాబాద్ చేతిలో పంజాబ్ చిత్తు

by Anukaran |   ( Updated:2020-10-08 20:14:20.0  )
హైదరాబాద్ చేతిలో పంజాబ్ చిత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్‌ ఎలెవన్ చిత్తు చిత్తుగా ఓడింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ 69 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసి జట్టు విజయం లో కీలక పాత్ర వహించాడు. 4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రే ఇచ్చాడు. ఇందులో ఒక మేడ్ ఇన్ ఓవర్ వేయడం గమనార్హం.

పంజాబ్ ఇన్నింగ్స్:

202 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు చతికిలపడ్డారు. 11 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (9) రనౌట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సిమ్రాన్ సింగ్ ఎంత సేపు క్రీజులో నిలబడలేదు. 5వ ఓవర్‌లో 31 స్కోర్ బోర్డు వద్ద కలీల్ అహ్మద్ వేసిన బంతిని షాట్ ఆడబోయి ప్రియమ్ గార్గ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 31 పరుగులకే పంజాబ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన పూరన్‌ బౌండరీలతో మెరిసిన కాసేపటికే.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిషేక్ వేసిన బంతిని బౌండరీ కొట్టబోయి కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 58 పరుగులకే పంజాబ్ 3 వికెట్లను కోల్పోయింది.

ఇక మిడిలార్డ్‌లో వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లు బాది (50) పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా సిక్సర్ల మోత మోగించాడు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌కు పూరన్ పిల్లర్ లాగా నిలబడ్డాడు. వరుసగా బౌండరీలను పారిస్తూ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఉన్నంత సేపు బ్యాటుకు పని చెప్పాడు. మొత్తం 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్షర్లతో చెలరేగి ఏకంగా 77 పరుగులు చేశాడు. పూరన్‌ ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ మంచి భాగస్వామ్యం ఇవ్వకపోవడంతో పంజాబ్ ఓటమి చవి చూసింది.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన పూరన్‌ మినహాయిస్తే.. ఏ ఒక్క ఆటగాడు పట్టుమని పది పరుగులు చేయలేదు. మ్యాక్స్‌వెల్ (7), మందీప్ సింగ్ (6), ముజీబ్ ఉర్ రహమన్ (1), రవి భిష్ణోయ్ (6) నాటౌట్‌గా నిలిచాడు. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన షమీ, కాట్రెల్, అర్ష్‌దీప్ లు డకౌట్ అయ్యారు. దీంతో 132 పరుగులకే పంజాబ్ చేతులెత్తేసింది. దీంతో 69 పరుగుల భారీ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్:

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 160 పరుగుల భాగస్వామ్యంతో ఈ సీజన్‌లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బెయిర్ స్టో కేవలం 55 బంతుల్లో 97 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను క్రీజులో ఉన్న సమయంలో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఇక డేవిడ్ వార్నర్ కూడా హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. 40 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో తొలి 15 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు 160/0గా ఉంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు వచ్చినట్టే పెవిలియన్ చేరడంతో స్కోర్ కాస్తా నత్తనడకగ సాగిన ఎట్టకేలకు స్కోర్ బోర్డు 201 చేరింది.

పంజాబ్ స్పిన్నర్లు తిప్పేశారు…

ఇక క్రీజులో కుదురుకున్న డేవిడ్ వార్నర్(52), బెయిర్ స్టో(97)లకు పంజాబ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ షాక్ ఇచ్చాడు. 16వ ఓవర్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. అదే ఓవర్ తొలి బంతికి క్యాచ్‌ రూపంలో వార్నర్ ఔట్ అయ్యాడు. ఇదే ఉత్సహంతో ఉన్న రవి భిష్ణోయ్‌ స్పిన్ బంతులను సంధిస్తూ బెయిర్ స్టో నూ సైతం కంగారు పెట్టాడు. 16వ ఓవర్‌ నాలుగో బంతికి lbwతో బెయిర్ స్టో‌ను కూడా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే‌ను(1) పరుగు చేయగానే ఔట్ చేశాడు.
దీంతో 1 పరుగు వ్యవధిలోనే(160 నుంచి161) సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్లు ఔట్ కావడంతోనే పంజాబ్ మరో స్పిన్నర్ అర్ష్‌దీప్ సింగ్ చెలరేగిపోయాడు. మిడిలార్డర్‌లో వచ్చిన అబ్దుల్‌ సమద్‌ను 8 పరుగులు చేయగానే 17 ఓవర్‌లోనే వికెట్ తీసుకున్నాడు. దీంతో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్లు కాస్త ఒత్తిడికి గురయ్యాడు. మళ్లీ 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ ప్రియమ్ గార్గ్‌ను డకౌట్ చేశాడు. టాప్ ఆర్డర్ చివరిలో వచ్చిన అభిషేక్ శర్మ (12) పరుగులు చేసి చివరి ఓవర్‌లో షమి వేసిన బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్‌( 20) పరుగులతో ఆచితూచి ఆడుతూ నాటౌట్‌గా నిలిచి మిగతా ఇన్నింగ్స్‌ను పూర్తి చేశారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

స్కోర్‌ బోర్డు:

Sunrisers Hyderabad Innings: డేవిడ్ వార్నర్ (C) c మ్యాక్స్‌వెల్ b రవి భిష్ణోయ్ 52(40), జానీ బెయిర్ స్టో (WK) lbw b రవి భిష్ణోయ్ 97 (55), అబ్దుల్ సమద్ c అర్ష్‌దీప్ సింగ్ b రవి భిష్ణోయ్ 8(7), మనీష్ పాండే c and b అర్ష్‌దీప్ సింగ్ 1(2), కేన్ విలియమ్సన్ నాటౌట్ 20(10), ప్రియమ్ గార్గ్ c పూరన్ b అర్ష్‌దీప్ సింగ్ 0(1), అభిషేక్ శర్మ c మ్యాక్స్‌వెల్ b షమీ 12(6), ఎక్స్‌ట్రాలు 11, మొత్తం స్కోరు 201/6

వికెట్ల పతనం: 160-1 (డేవిడ్ వార్నర్, 15.1), 160-2 (జానీ బెయిర్ స్టో, 15.4), 161-3 (మనీష్ పాండే, 16.1), 173-4 (అబ్దుల్ సమద్, 17.5)., 175-5 ( ప్రియమ్ గార్గ్, 18.1), 199-6 (అభిషేక్ శర్మ, 19.5).

బౌలింగ్: షెల్డన్ కాట్రెల్ 3-0-33-0, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4-0-39-0, మహ్మద్ షమీ 4-0-40-1, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-26-0, రవి బిష్ణోయ్ 3-0-29-3, అర్ష్‌దీప్ సింగ్ 4-0-33-2.

Kings XI Punjab Innings: కేఎల్ రాహుల్ (c)c విలియమ్సన్ b అభిషేక్ శర్మ 11(16),.. మయాంక్ అగర్వాల్ రనౌట్ (వార్నర్/కలీల్ అహ్మద్) 9(6),.. సిమ్రాన్ సింగ్ (wk)c ప్రియమ్ గార్గ్ b కలీస్ అహ్మద్ 11(8),.. నికోలస్ పూరన్ c టి.నటరాజన్ b రషీద్ ఖాన్ 77(37), గ్లెన్ మ్యాక్స్‌వెల్ రనౌట్ (ప్రియమ్ గార్గ్) 7(12), మందీప్ సింగ్ b రషీద్ ఖాన్ 6(6), ముజీబ్ ఉర్ రహమాన్ c బెయిర్ స్టో b కలీల్ అహ్మద్ 1(3), రవి భిష్ణోయ్ నాటౌట్ 6(7), మహ్మద్ షమీ lbw b రషీద్ ఖాన్ 0(1), షెల్డన్ కాట్రెల్ b నటరాజన్ 0(2), అర్ష్‌దీప్ సింగ్ c వార్నర్ b టీ. నటరాజన్ 0(3), ఎక్స్‌ట్రాలు 4 మొత్తం 132

వికెట్ల పతనం: 11-1 (మయాంక్ అగర్వాల్, 1.3), 31-2 (సిమ్రాన్ సింగ్, 4.2), 58-3 (కేఎల్ రాహుల్, 6.4), 105-4 (గ్లెన్ మ్యాక్స్‌వెల్, 11), 115-5 (మందీప్ సింగ్, 12.3), 126-6 (ముజీబ్ ఉర్ రహమాన్, 13.5), 126-7 (నికోలస్ పూరన్, 14.5), 126-8 (మహ్మద్ షమీ, 14.6), 132-9 (షెల్డన్ కాట్రెల్, 16.2), 132-10 (అర్ష్‌దీప్ సింగ్, 16.5).

బౌలింగ్: సందీప్ శర్మ 4-0-27-0, కె కలీల్ అహ్మద్ 3-0-24-2, టి. నటరాజన్ 3.5-0-24-2, అభిషేక్ శర్మ 1-0-15-1, రషీద్ ఖాన్ 4-1-12-3, అబ్దుల్ సమద్ 1-0-28-0,

Advertisement

Next Story

Most Viewed