ఓపెనర్లు బాదితే.. స్పిన్నర్లు తిప్పేశారు.. అయినా 201/6

by Anukaran |   ( Updated:2020-10-08 10:51:08.0  )
ఓపెనర్లు బాదితే.. స్పిన్నర్లు తిప్పేశారు.. అయినా 201/6
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 160 పరుగుల భాగస్వామ్యంతో ఈ సీజన్‌లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బెయిర్ స్టో కేవలం 55 బంతుల్లో 97 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను క్రీజులో ఉన్న సమయంలో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఇక డేవిడ్ వార్నర్ కూడా హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. 40 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో తొలి 15 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు 160/0గా ఉంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు వచ్చినట్టే పెవిలియన్ చేరడంతో స్కోర్ కాస్తా నత్తనడకగ సాగిన ఎట్టకేలకు స్కోర్ బోర్డు 201 చేరింది.

పంజాబ్ స్పిన్నర్లు తిప్పేశారు…

ఇక క్రీజులో కుదురుకున్న డేవిడ్ వార్నర్(52), బెయిర్ స్టో(97)లకు పంజాబ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ షాక్ ఇచ్చాడు. 16వ ఓవర్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. అదే ఓవర్ తొలి బంతికి క్యాచ్‌ రూపంలో వార్నర్ ఔట్ అయ్యాడు. ఇదే ఉత్సహంతో ఉన్న రవి భిష్ణోయ్‌ స్పిన్ బంతులను సంధిస్తూ బెయిర్ స్టో నూ సైతం కంగారు పెట్టాడు. 16వ ఓవర్‌ నాలుగో బంతికి lbwతో బెయిర్ స్టో‌ను కూడా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే‌ను(1) పరుగు చేయగానే ఔట్ చేశాడు. దీంతో 1 పరుగు వ్యవధిలోనే(160 నుంచి161) సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్లు ఔట్ కావడంతోనే పంజాబ్ మరో స్పిన్నర్ అర్ష్‌దీప్ సింగ్ చెలరేగిపోయాడు. మిడిలార్డర్‌లో వచ్చిన అబ్దుల్‌ సమద్‌ను 8 పరుగులు చేయగానే 17 ఓవర్‌లోనే వికెట్ తీసుకున్నాడు. దీంతో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్లు కాస్త ఒత్తిడికి గురయ్యాడు. మళ్లీ 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ ప్రియమ్ గార్గ్‌ను డకౌట్ చేశాడు. టాప్ ఆర్డర్ చివరిలో వచ్చిన అభిషేక్ శర్మ (12) పరుగులు చేసి చివరి ఓవర్‌లో షమి వేసిన బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్‌( 20) పరుగులతో ఆచితూచి ఆడుతూ నాటౌట్‌గా నిలిచి మిగతా ఇన్నింగ్స్‌ను పూర్తి చేశారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

స్కోర్‌ బోర్డు:

Sunrisers Hyderabad Innings: డేవిడ్ వార్నర్ (C) c మ్యాక్స్‌వెల్ b రవి భిష్ణోయ్ 52(40), జానీ బెయిర్ స్టో (WK) lbw b రవి భిష్ణోయ్ 97 (55), అబ్దుల్ సమద్ c అర్ష్‌దీప్ సింగ్ b రవి భిష్ణోయ్ 8(7), మనీష్ పాండే c and b అర్ష్‌దీప్ సింగ్ 1(2), కేన్ విలియమ్సన్ నాటౌట్ 20(10), ప్రియమ్ గార్గ్ c పూరన్ b అర్ష్‌దీప్ సింగ్ 0(1), అభిషేక్ శర్మ c మ్యాక్స్‌వెల్ b షమీ 12(6), ఎక్స్‌ట్రాలు 11, మొత్తం స్కోరు 201/6

వికెట్ల పతనం: 160-1 (డేవిడ్ వార్నర్, 15.1), 160-2 (జానీ బెయిర్ స్టో, 15.4), 161-3 (మనీష్ పాండే, 16.1), 173-4 (అబ్దుల్ సమద్, 17.5)., 175-5 ( ప్రియమ్ గార్గ్, 18.1), 199-6 (అభిషేక్ శర్మ, 19.5).

బౌలింగ్: షెల్డన్ కాట్రెల్ 3-0-33-0, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4-0-39-0, మహ్మద్ షమీ 4-0-40-1, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2-0-26-0, రవి బిష్ణోయ్ 3-0-29-3, అర్ష్‌దీప్ సింగ్ 4-0-33-2.

Advertisement

Next Story

Most Viewed