సన్‌రైజర్స్ రైజింగ్ స్కోరు 219/2

by Shyam |   ( Updated:2020-10-27 12:07:59.0  )
సన్‌రైజర్స్ రైజింగ్ స్కోరు 219/2
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 47వ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు చుక్కలు చూపించారు. ఏకధాటిగా బౌండరీలు బాదుతూ బౌలర్ల వెన్నులో వణుకుపుట్టించారు. భారీ స్ట్రైక్‌రేట్ మెయింటేన్ చేస్తూ భారీ స్కోరు నమోదు చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 219 స్కోరు నమోదు చేసింది.

హైదరాబాద్ ఇన్నింగ్స్:

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు శుభారంభం చేశారు. డేవిడ్ వార్నర్(66) తొలి 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి భారీ స్కోరుకు పునాదులు వేశాడు. ఇక ఆ తర్వాత వృద్ధిమాన్ సాహ(87) కూడా బౌండరీల మోత మోగించాడు. తాను కూడా తొలి 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు బ్యాట్స్‌మెన్లు మైదానంలో వీర విహారం చేశారు.

వీరిద్దరు కలిసి 58 బంతుల్లో 107 పరుగులు చేశారు. ఆ తర్వాత 107 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(44 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆతర్వాత 170 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహ కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో మిడిలార్డర్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు దీంతో హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది.

వృద్ధిమాన్ సాహో.. వార్నర్ అదరహో

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ముఖ్యంగా వృద్ధిమాన్ సాహో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి నుంచి నిలకడగా రాణిస్తూ ఒక్కసారిగా ఉరిమాడు. మొత్తం 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 87 పరుగులు చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ కూడా తన బర్త్ డే రోజు అభిమానులకు గుర్తుండేలా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 66 పరుగులు చేశాడు. వీరిద్దరు 58 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం చేసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. ఇక ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే కూడా 31 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో స్కోరు బోర్డు 219కు చేరుకుంది.

స్కోరు బోర్డు:

1. డేవిడ్ వార్నర్ (c)c అక్సర్ b అశ్విన్ 66(34)
2. వృద్ధిమాన్ సాహ (wk)c శ్రేయాస్ అయ్యర్ b నొర్ట్జే 87(45)
3. మనీష్ పాండే నాటౌట్ 44(31)
4. కేన్ విలియమ్సన్ నాటౌట్ 11(10)

ఎక్స్‌ట్రాలు: 11

మొత్తం స్కోరు: 219

వికెట్ల పతనం: 107-1 (డేవిడ్ వార్నర్, 9.4), 170-2 (వృద్ధిమాన్ సాహ, 14.3)

బౌలింగ్:

1. ఎన్రిచ్ నొర్ట్జే 4-0-37-1
2. కగిసో రబాడా 4-0-54-0
3. రవిచంద్రన్ అశ్విన్ 3-0-35-1
4. అక్సర్ పటేల్ 4-0-36-0
5. తుషర్ దేశ్‌పాండే 3-0-35-0
6. మార్క్యూస్ స్టోయినిస్ 2-0-15-0

Advertisement

Next Story

Most Viewed