తన మనసులో మాటను బయటపెట్టిన గూగుల్ సీఈవో..

by Anukaran |   ( Updated:2021-07-13 02:29:16.0  )
sunder-pichai ,
X

దిశ, వెబ్‌డెస్క్ : గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఎట్టకేలకు తన మనసులో మాట బయటపెట్టారు. బీబీసీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో తానూ కూడా ఎగరాలని అనుకున్నట్లు తెలిపారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ను చూస్తుంటే తనకు కొంచెం జెలస్ ఫీలింగ్ వస్తుందని పేర్కొన్నారు. ‘‘అంతరిక్షం నుంచి భూమి ఎలా ఉంటుందో చూడాలని తాను అనుకున్నట్లు, అది తనకెంతో నచ్చుతుందని’’ తన కోరికను బీబీసీ ఛానల్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు సుందర్.

ఇదిలాఉండగా ఈనెల 20న అమెజాన్ సీఈవో అంతరిక్ష యాత్రకు బయలు దేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుందర్ పిచాయ్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే వర్జిన్ గెలాక్సీ రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి అంతరిక్ష నౌకను ప్రారంభించింది. రెండ్రోజుల కింద ఐదుగురు వ్యక్తులు అంతరిక్ష యాత్రను చేపట్టి సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. ఆ యాత్రలో ఇండియన్ ఆరిజిన్ ఏపీలోని గుంటూరుకు చెందిన శిరీష కూడా వన్ ఆఫ్ ద మెంబర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

https://www.inshorts.com/en/news/im-a-bit-jealous-google-ceo-sundar-pichai-on-jeff-bezos-flying-to-space-1626103329806

Advertisement

Next Story

Most Viewed