ఆ రాశి వారు ఊహల్లో బతకడం మానేస్తే బెటరంట..

by Hamsa |
Panchangam
X

తేది : 25 జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
(నిన్న ఉదయం 8 గం॥ 9 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 51 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(నిన్న ఉదయం 12 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 21 ని॥ వరకు)
యోగము : ఆయుష్మాన్
కరణం : కౌలవ
వర్జ్యం : ( సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి 4 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (తెల్లవారు జాము 1 గం॥ 32 ని॥ నుంచి 3 గం॥ 2 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (సాయంత్రం 5 గం॥ 8 ని॥ నుంచి 5 గం॥ 59 ని॥ వరకు)
రాహుకాలం : (సాయంత్రం 5 గం॥ 14 ని॥ నుంచి రాత్రి 6 గం॥ 51 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు సాయంత్రం 3..

మేష రాశి : ఈ రోజును ఆశాజనకంగా ప్రారంభిస్తారు. ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ భవిష్యత్తు కొరకు వినూత్నమైన ఆలోచనలు చేయండి. ఆర్థికపరమైన విషయాలలో కోర్టు కేసు మీకు అనుకూలంగా వస్తుంది. మీకు ఎంతో లాభం. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కొంతమందికి ఆఫీస్ టూర్స్. సరైన ప్రణాళికతో ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం ఎంతో ఎనర్జీగా ఉంటారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

వృషభ రాశి : ఈ రోజు సాధారణంగా గడిచిపోతుంది అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. కుటుంబ సభ్యులకు ఇంటి పనులలో సహాయం చేస్తారు. స్థిరాస్తి అమ్మకంలో అనుకోని లాభాలు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులలో లాభాలు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది. పాత స్నేహితులను కలుస్తారు ఆనందంగా గడుపుతారు అవసరంలో ఉన్న వారికి డబ్బు సహాయం చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మిధున రాశి : ఈరోజు పనులు అనుకున్నంతగా సాగవు. మీ చేతికందినదే మీది అందే వరకు ఎదురు చూడండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తటపటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీ తోడబుట్టిన వారికి డబ్బు సహాయం చేస్తారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఒకే రకమైన జీవితం కాకుండా వినూత్నంగా ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి : మీ కమ్యూనికేషన్ తో ఇతరులను మెప్పిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. గుండెజబ్బుతో బాధపడేవారు కాఫీని వదిలివేయండి. పాతబాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సకాలంలో పనులు పూర్తి చేయటానికి మరింత కష్టపడాలి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. కావలసినంత ధనం చేతికందుతుంది. అనవసర దుబారా ఖర్చులను ఒక కంట గమనించండి. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. మీరే కరెక్టు అని కుటుంబ సభ్యులతో మొండి వాదనలకు దిగకండి. దాని వలన వారు హర్ట్ అవుతారు లేనిపోని ఇబ్బందులు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కన్యారాశి : దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత. దైవ ప్రార్ధన వలన ఎంతో ధైర్యం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలను తెస్తాయి. జాగ్రత్త వహించండి. సమస్యల విషయంలో ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన మీ శరీరం అందంగా తయారవుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

తులారాశి : కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. విదేశీ ప్రయాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆదాయం బాగున్నా దుబారా ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది కలుగుతోంది అనే విషయాన్ని తెలుసుకుంటారు. అనవసర విషయాల మీద సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృశ్చిక రాశి : ఈరోజు అన్ని పనులలో అభివృద్ధి. చాలా అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. ఒడిసి పట్టుకోండి సరైన కమ్యూనికేషన్ విజయానికి సూత్రం. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు. సంఘంలో పేరుప్రతిష్టలు. ప్రముఖ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు షాపింగ్ చేస్తారు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి : ఈరోజు మీ సహనానికి పరీక్ష. మీ నిరాశావాద ధోరణి వలన సరైన ఫలితాలు రాకపోవచ్చు. దైవ ప్రార్ధన వలన మానసిక బలము మరియు సరైన ఆలోచనలు. కొంతమంది ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కుటుంబంలో జరుగుతున్న ఫంక్షన్ వలన స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. సరైన ప్రణాళిక లేకుండా పనులను చేస్తూ పోవడం వలన సమయం వృధా. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. కొంతమందికి వారి పిల్లల ద్వారా ధనలాభం. సిగరెట్, మందు వంటి చెడు అలవాట్లను దూరం పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవి చూస్తారు.

మకర రాశి : వ్యాపారులకు వారి ఊహలు నిజం అవ్వటం వలన అధిక లాభాలు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు మరింత లాభాలను తెస్తాయి. ఈ రోజు అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. కుటుంబ సభ్యుల మీద కోప తాపాలు ప్రదర్శించకండి. వారు హర్ట్ అయితే ఇబ్బందులు. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే అధిక శ్రమ పడాలి సరైన భోజనం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కుంభరాశి : ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఊహలతో బతకకండి. పరిస్థితులతో సర్దుకుపోవాలి. కొంతమంది విదేశీ ప్రయాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. శారీరక మానసిక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. మరింత సంపాదన కొరకు నూతన ప్రణాళికలు వేస్తారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో భేదాభిప్రాయాలు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయండి. నిరుద్యోగులు ఉద్యోగం కొరకు మరింత శ్రమపడాలి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. అదృష్టం మీ పక్షాన ఉంది. కుటుంబ సభ్యులలో ముఖ్యంగా పెద్ద వారి సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో లాభాలు. ఆఫీస్ పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. అనుకోని అతిథుల రాక వలన ఆనందమూ లాభము. కొంతమంది వ్యక్తులతో గడపటం వలన సమయం వృధా అయిందని అనుకొంటారు. విజయం సాధించాలంటే క్రమశిక్షణ అవసరం. ఈరోజు నుంచి దానిని అలవాటు చేసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ వ్యవహారాల గురించి మరియు భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed