- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌కు ముందే పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. అయితే ఈసారి ఏప్రిల్ 27 నుంచి సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సెకండ్ వేవ్‌తో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎప్పటిలాగానే ఏప్రిల్ 24వ తేదీ నుంచే ఉపాధ్యాయులు, విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం పాఠశాలలకు విద్యార్థులు రాకపోయినా.. ఉపాధ్యాయులు మాత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నందు వెంటనే వేసవి సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చాయి.దీంతో కేసీఆర్ సర్కార్ ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించి.. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.