- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లయిన ఐదునెలలకే ఆత్మహత్య

X
దిశ, మేడ్చల్: పెళ్లయిన ఐదు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని నేరేడుమెట్‌లో చోటుచేసుకుంది. ఈ విషాదఘటన స్థానికంగా కలకలం రేపింది. రాహుల్ యాదవ్(26) రైల్వేలో ఉద్యోగం చేస్తూ నేరేడుమెట్‌లో నివాసం ఉంటున్నాడు. ఐదు నెలల క్రితం రాహుల్ యాదవ్‌కు వివాహం జరిగింది. ఇంతలో ఏమైందో తెలియదు గానీ.. తన ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
Tags: new bride, suicide, at home, neredmet
Next Story