- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుధీర్, ఇంద్రగంటి.. ముచ్చటగా మూడోసారి!
దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో సుధీర్ బాబు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను అద్భుతంగా బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇటీవలే ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సుధీర్.. తన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘పలాస’తో ఇండస్ట్రీ ప్రశంసలందుకున్న దర్శకుడు కరుణ కుమార్‌తో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ తన అభిమానులకు దీపావళి కానుకగా మరో స్వీట్ న్యూస్ చెప్పాడు. తన ఇష్టమైన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశాడు.
దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. సుధీర్ బాబుకు జోడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి నటించనుంది. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు, కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్నాడు. సుధీర్ బాబు, ఇంద్రగంటి కలిసి చేసిన తొలి సినిమా ‘సమ్మోహనం’ మంచి హిట్ అందుకోగా, వారిద్దరూ కలిసి చేసిన రెండో సినిమా ‘వి’ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరి మూడో సినిమా వారిద్దరికీ మరో బిగ్ హిట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.