ఇందుర్తిలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఆత్మహత్య

by  |
ఇందుర్తిలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఆత్మహత్య
X

దిశ,మునుగోడు: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో ఓ వ్యక్తి చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాలలోకి వెళ్తే ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకన్న(40) గురువారం ఉదయం తమ వ్యవసాయ భూమిలోని వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు శివన్నగూడం సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సోదరులు ఆస్తి పంపకాలు చేసుకున్నారని అప్పటి నుండి మానసికంగా ఇబ్బంది పడుతూ తాగుడుకు బానిసయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిగూడ ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు.


Next Story

Most Viewed