తల్లితో సహజీవనం.. కూతురుపై అఘాయిత్యం

by srinivas |
తల్లితో సహజీవనం.. కూతురుపై అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఒంగోలులో జరిగిన ఓ అమానవీయ ఘటన బుధవారం వెలుగులోకివచ్చింది. ఇదివరకే తల్లితో సహజీవనం చేస్తున్న సుభాని అనే వ్యక్తి .. ఆమె ఇంట్లో లేని సమయంలో కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని ఒంగోలు అర్థవీడులో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గోపాల్‌నగర్‌కు చెందిన
సుభాని అనే వ్యక్తి అర్ధవీడులోని స్థానిక కళాశాలలో పనిచేస్తున్న మహిళతో కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఓరోజు మహిళ ఇంట్లో లేని సమయం చూసి ఆమె కూతురుపై లైంగిక దాడి చేశాడు. అయితే, ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో భయపడిన బాధితురాలు కొన్నిరోజులు అమ్మమ్మ వద్ద తలదాచుకుంది. చివరకు తనకు న్యాయం చేయాడమే కాకుండా రక్షణ కల్పించాలంటూ స్థానిక దిశ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed