- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీరం దాటుతున్న ‘స్టైరిన్ గ్యాస్’
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంతో పాటు దాని పరిసరాల్లోని ఐదు గ్రామాలకు కాళ రాత్రి మిగిల్చిన స్టైరిన్ గ్యాస్ తీరం దాటుతోంది. ప్రమాదం అనంతరం వైజాగ్‌లో 13 వేల టన్నుల స్టైరిన్ లిక్విడ్ గ్యాస్ వైజాగ్‌లో ఉందని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని విశాఖలో ఉంచకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిని నేపథ్యంలో తరలింపు ఆరంభమైంది.
ప్రమాదం అనంతరం పూణే, నాగ్‌పూర్, గుజరాత్‌కు చెందిన నిపుణులు వచ్చి, ఎన్డీఆర్ఎప్ దళాలతో కలిసి కంపెనీలో నిల్వ ఉంచిన ట్యాంకులో ఉష్ణోగ్రతను అదుపులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు అదుపులోకి రాగానే, దీనిని వైజాగ్‌లో ఉంచకూడదని ఆదేశించింది. దీంతో యాజమాన్యం నిల్వ ఉన్న కెమికల్‌ను ఎల్జీ ప్రధాన కేంద్రమైన దక్షిణ కొరియాకు తరలించాలని నిర్ణయించింది. దీంతో వెంటనే వైజాగ్ పోర్టుకు ట్యాంకర్‌ను పంపింది. దీంతో అందులో 8 వేల టన్నల స్టైరిన్ రసాయనాన్ని ఎం/టి అర్హ అనే నౌక బయల్దేరింది. మిగిలిన ఐదు వేల టన్నుల రసాయనాన్ని త్వరలోనే కొరియాకు తరలించనుంది.
మరోవైపు ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్ నుంచి చిన్నగా విడుదలవుతున్న విష వాయువులను నియంత్రించడానికి మరో 8.3 టన్నుల విరుగుడు రసాయనాన్ని గుజరాత్ నుంచి తెప్పించారు. వైమానిక దళానికి చెందిన రెండు ఏఎన్-32 విమానాల్లో ఈ మొత్తాన్ని తెప్పించారు. ఇందులో 1.1 టన్నుల టెరిటెయరి బుటైల్ కెటకహాల్, మరో 7.2 టన్నుల పోలరైజేషన్ ఇన్‌హేబిటర్స్ తీసుకువచ్చారు. నియంత్రణ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఢిల్లీ) డైరెక్టర్, ముంబైకి చెందిన స్టైరిన్ స్పెషలిస్టు కూడా వచ్చారు.
ఈ క్రమంలో కంపెనీని మూసేయాలంటూ పరిసరగ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కంపెనీని ఇప్పుడే తెరవడం లేదని ప్రజాప్రతినిధులు తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా విచారణ జరుగుతుందని అన్నారు. ఈ నివేదిక వచ్చేవరకు కంపెనీ తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.