- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియన్ జాగ్రఫీ - భారతదేశ ఉనికి: (APPSC, TSPSC,SI/PC ఎగ్జామ్ స్పెషల్)
ఉనికి.. వ్యాప్తి:
అక్షాంశాలు, రేఖాంశాలు ద్వారా ఒక స్థలం ఉనికిని తెలుసుకోవచ్చు.
భారతదేశం ఉత్తరార్ధగోళంలో 8º4' - 37º6' ఉత్తర అక్షాంశాలు, 68º7' - 97º25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశరేఖ అయిన కర్కాటకరేఖ భారతదేశం మధ్యభాగం గుండా పోతుంది.
ఈ కర్కాటకరేఖ దేశంను ఉష్ణమండల సమశీతోష్ణ మండలం అను రెండు సమ అర్ధ భాగాలుగా విభజిస్తుంది.
భారతదేశం ఒక ఉపఖండం:
ప్రత్యేకమైన ఖండాంతర లక్షణాలు ఉండటం వలన భారతదేశాన్ని ఉపఖండంగా భావిస్తారు.
ఉపఖండం ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటుంది. అవి
విభిన్న నైసర్గిక స్వరూపాలు
శీతోష్ణ పరిస్థితులు
సహజ వృక్షజాలం
సాంస్కృతిక అంశాలు
ప్రాచీన జాతులు, విభిన్న భాషా సమూహాలు, సువిశాలమైన భూమి
32,87,263 చ.కి.మీ విస్తీర్ణం కలిగి ఉంది.
భారతదేశం ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు సుమారు 3,124 కి.మీ.. పశ్చిమాన గుజరాత్ నుండి ఈశాన్యమున అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు 2,933 కి.మీ విస్తరించింది.
భారతదేశ తీరరేఖ పోడవు ప్రధాన భూభాగంతో పాటు లక్ష దీవులు, అండమాన్ నికోబార్ కలుపుకుని 7,516 కి.మీ ఉంది.
భారతదేశం సూయజ్ కాలువ ద్వారా ఐరోపాతో పాటు చైనా, జపాన్, ఆస్ట్రేలియా మలక్కా జలసంధి ద్వారా వ్యాపార, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా ఉంది.
భారతదేశ పరిమాణం:
ఆసియాలో భారత దేశం రెండవ పెద్ద దేశం. ఇది పాకిస్థాన్ కంటే 4 రెట్లు పెద్దది కానీ యూఎస్‌ఏ కంటే 3 రెట్లు చిన్నది.
భారత ప్రామాణిక కాలం:
ఒక ప్రాంతానికి చెందిన కాలాన్ని గణించుటకు రేఖాంశం ఉపయోగపడుతుంది.
అలహాబాద్‌కు సమీపాన భారతదేశానికి మధ్యగా పోవుచున్న 82డిగ్రీల 30 యూనిట్స్ రేఖాంశం భారత ప్రామాణిక కాలరేఖ గా పరిగణిస్తారు.
ఇది గ్రీన్‌విచ్ ప్రామాణిక కాలం (0 డిగ్రీ రేఖాంశం)నకు 5 గంటల 30 నిమిషాలు ముందంజలో ఉంటుంది.
స్వాతంత్య్రం తర్వాత భారత ప్రభుత్వం ఐఎస్‌టి ని అధికారిక కాలంగా ప్రకటించింది.
దక్షిణాన భారతదేశం, శ్రీలంకను పాక్ జలసంధి వేరు చేస్తుంది.
హిమాలయాలు భారతదేశానికి ఉత్తరాన సహజ సరిహద్దుగా ఉన్నాయి.
తూర్పున గల అరకన్‌యోమా పర్వత శ్రేణులు భారతదేశాన్ని మయన్మార్ నుండి వేరు చేస్తున్నాయి.
భారత్‌కు సరిహద్దుగా గల దేశాలు:
పశ్చిమాన పాకిస్తాన్
ఉత్తరాన ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, చైనా
తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్
సముద్రాలు:
దక్షిణాన హిందూ మహాసముద్రం
తూర్పు, ఆగ్నేయాన బంగాళాఖాతం
పశ్చిమాన అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.
ప్రపంచంలో ఎత్తైన శిఖరం
ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది.
ఇది హిమాలయ పర్వతాలలో నేపాల్, చైనా సరిహద్దులో ఉంది.
దీని ఎత్తు సముద్రమట్టం నుండి 8848 మీటర్లు.
శీతోష్ణస్థితి ఉష్ణమండలం నుండి సమశీతోష్ణ మండలంలో మారుతుంది.
మేఘాలయలో గల చిరపుంజి అధిక వర్షపాతం, థార్ ఎడారి చాలా తక్కువ వర్షపాతం పొందుతున్నవి.
పశ్చిమ కనుమలలో తేమగల దట్టమైన ఉష్ణమండల అరణ్యాలు, ప.బెంగాల్‌లో బురదతో కూడిన చిత్తడి నేల అరణ్యాలు (మాంగ్రోవర్ అరణ్యాలు), థార్ ఎడారిలో చిట్టడవులు, పొడి ప్రదేశ సహజ వృక్ష జాలాన్ని కలిగి ఉన్నాయి.
భౌగోళిక పర్యావరణం, శీతోష్ణస్థితి భారతదేశంను విభిన్న వృక్ష, జంతు జాతులు నివాసయోగ్య స్థానంగా ఏర్పరచుకున్నాయి.