కేటీఆర్‌ను అడ్డుకుంటాం.. అరెస్ట్

by Shyam |
కేటీఆర్‌ను అడ్డుకుంటాం.. అరెస్ట్
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా జిల్లాలో పోలీసులు పలువురిని ముందస్తు అరెస్టు చేశారు. ఆదివారం నుండే విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలను అనుమతి లేనివి మూసివేయాలని, అదే విధంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీటిని పరిష్కరించకపోతే మంత్రి కేటీఆర్‌ను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని ముందస్తు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story