KTR పర్యటన ఎఫెక్ట్.. విద్యార్థి నాయకులు అరెస్ట్

by Shyam |   ( Updated:2021-11-09 01:46:22.0  )
KTR పర్యటన ఎఫెక్ట్.. విద్యార్థి నాయకులు అరెస్ట్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసు శాఖ అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించినా వివిధ విద్యార్థి సంఘాలు, ఇతర సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. విద్యార్థి సంఘాలు, బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నాయకుల ఇళ్లకు వెళ్లి ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు వారిని తరలించినట్టుగా తెలుస్తోంది.

అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ వేణు, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విఠల్, టీజేఎస్ జిల్లా కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఏబీవీపీ జిల్లా నాయకులు మనోజ్, ఇతర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తున్నదని అన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. ఈ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు.

Next Story

Most Viewed