ముగ్గురు చిన్నారులపై వీధికుక్కల దాడి

by Shyam |
ముగ్గురు చిన్నారులపై వీధికుక్కల దాడి
X

దిశ, స్టేషన్ ఘనపూర్ :జనగామ జిల్లాలో దారుణం‌ జరిగింది. ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన జిల్లాలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. గోవర్ధనగిరి గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న అమూల్య, మహసేన్, శాన్వి అనే ముగ్గురు చిన్నారుల పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒకే సారి ఎక్కువ సంఖ్యలో కుక్కలు మీద పడి దాడి చేయటంతో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ చిన్నారి చెవి తెగిపడగా, మరో చిన్నారికి కన్ను సమీపంలో గాయమవ్వగా, తీవ్ర రక్తస్రావం జరిగింది. అదృష్టవశాత్తు చిన్నారి కన్నుకు ఏలాంటి నష్టం సంభవించలేదు. వారి కుటుంబ సభ్యులు గాయపడిన చిన్నారులను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

Advertisement

Next Story

Most Viewed