- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ బైపోల్‌లో విచిత్రం.. ఆ కేసుల చుట్టూ రాజకీయం
దిశ ప్రతినిధి, కరీంనగర్: చెప్పే వానికి వినే వాడు లోకువ అన్న నానుడి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది వీరికి. ఓటరు దేవుళ్లను ప్రాపకం చేసుకునేందుకు ఆయా పార్టీలు చేస్తున్న వింత ప్రచారం మరీ విడ్డూరంగా తయారైంది. అయితే ఓటర్లకు తాము చెప్తున్నవన్నీ పిట్ట కథలేనన్న విషయాన్ని మాత్రం విస్మరించి మరీ ప్రగల్బాలు చెప్పుకుంటున్నట్టుగా ఉంది వీరు వ్యవహరిస్తున్న తీరు. ఓటు కోసం కోటి విద్యలు అన్న తీరుకు భిన్నంగా ఇక్కడ ఆయా రాజకీయ పార్టీల నాయకులు ప్రజల చెవుల్లో పూలు పెట్టేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటర్ల ప్రాపకం కోసం ఆయా పార్టీల నాయకులు చెప్తున్న మాటలకు ఎన్నికల కమిషన్‌కు అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్‌కు పొంతన లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరేం చెప్పారంటే..
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 130కి పైగా ఉద్యమ కేసులు నమోదయ్యాయని పదే పదే చెప్తున్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఉస్మానియా వేదికగా గెల్లు చేసిన పోరాటాల ఫలితమే ఈ కేసులని ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అయితే అఫిడవిట్‌లో మాత్రం 3 కేసులు విచారణ దశలో ఉన్నాయని గెల్లు శ్రీనివాస్ వివరించారు. మిగతా కేసులన్నీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తి వేసిందా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
ఈటల తీరిది..
ఇక పోతే తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై కేసులు నమోదయ్యాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్తున్నారు. అయితే ఈటల తనపై నమోదయిన 19 కేసుల్లో 5 కేసులు విచారణ దశలో ఉన్నాయని వివరించారు.
కాంగ్రెస్ అభ్యర్థి..
స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత తనపై 24 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ అభ్మర్థి బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరైన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకట్ పై వంద కేసులు నమోదయ్యాయని వ్యాఖ్యానించారు. కానీ వెంకట్ మాత్రం తన అఫడవిట్ లో 8 కేసులు విచారణలో ఉన్నాయని పేర్కొనడం విశేషం.
ఉద్యమ భావజాలమేనా..
స్వరాష్ట్ర కల సాకారం కోసం జరిగిన ఉద్యమ ప్రస్థానంలో తామెంతో పని చేశామని చెప్పుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమై ఏడేళ్లు గడుస్తున్నా నేటీకి తమపై ఉన్న కేసుల గురించి చెప్పుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తుండడం కూడా విస్మయం కలిగిస్తోంది. ఈటలే కాదు గెల్లు కూడా ఉద్యమకారుడే అన్నభావన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగా ఈటలపై ఉన్న కేసుల కన్నా గెల్లు శ్రీనివాస్ పై నమోదయిన కేసులే ఎక్కువ అని ప్రజలను నమ్మించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థం అవుతోంది. వీరి ప్రచారాన్ని ఆధారం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కూడా తనపై నమోదైన కేసులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తనపై ఉద్యమ కేసులు మాత్రం లేదని స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాతే తాను చేసిన పోరాటాలపై నమోదయిన కేసులని చెప్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడా కేసుల ప్రస్తావన తీసుకొస్తూ ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ప్రసంగాలు చేస్తుండడం గమనార్హం.