జాలరి చేతికి చిక్కిన వింత చేప.. షాక్‌లో ప్రజలు

by Sridhar Babu |   ( Updated:2021-05-21 03:54:56.0  )
జాలరి చేతికి చిక్కిన వింత చేప.. షాక్‌లో ప్రజలు
X

దిశ, మోత్కూరు: తమకున్న సొంత కుంటలో చేపలు పడుతుండగా ఓ వింత చేప జాలర్లకు చిక్కిన సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రం పరిధిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జింకల యాకన్నకు మంగలి గడ్డ లో వ్యవసాయ భూమి ఉంది. అయితే తమకున్న వ్యవసాయ భూమి నుండి మోత్కూర్ గుండాల రహదారి కోసం మట్టిని తరలించగా కుంట ఏర్పడింది.

ఈ క్రమంలో భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టు నుండి విడుదలై నవాబుపేట రిజర్వాయర్ ద్వారా వచ్చిన జలాలను పిల్ల కాలువ ద్వారా కుంటను నింపారు. వేసవికాలం కావడంతో ఆ కుంటలో నీళ్లు తగ్గిపోవడంతో అందులో ఉన్న చేపలు పట్టడానికి ప్రయత్నించగా ఆ చేపలతో పాటు ఈ వింత చేప లభించిందని అతను తెలిపారు. మామూలు చేపలకు భిన్నంగా నోరు రంగు ఉండటంతో ఆ చేపగురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

Advertisement

Next Story