స్నానం చేస్తున్నా సర్… వదిలేయండి ప్లీజ్!!

by Anukaran |   ( Updated:2021-10-21 09:39:27.0  )
huzurabad by election campaign
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కొన్ని వింతలు దర్శనమిస్తున్నాయి. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్.. ఇంటింటికీ తిరుగుతూ గెల్లును గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.

ఇక మంత్రులే అంతలా తిరుగుతుంటే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఊరుకుంటారా..? లేచిందే తరువాయి.. నాయకులంతా ఓటర్ల ఇంటి ముందు వాలిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే, స్నానం చేస్తున్న సమయంలోనూ వదలడం లేదు. ఇలాంటి ఫోటోనే ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి స్నానం చేస్తుంటే గెల్లుకి సంబంధించిన కరపత్రాన్ని (ప్రచార పత్రం) అందజేశారు. ఈ ఫొటోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed