- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రీఫ్‌ను ఢీకొట్టి.. రాళ్లపై నిలిచిన నౌక!
దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సూయిజ్ కాలువలో మార్చిలో ‘ఎవర్ గివెన్’ అనే భారీ కంటైనర్ నౌక ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఇసుక తుఫాను, బలమైన గాలుల కారణంగా నౌక అడ్డం తిరిగి, దాని ముందుభాగం కాలువ గట్టులో కూరుకుపోగా.. అదే విధంగా మరొక పడవ ఇంగ్లీష్ చానెల్‌లో రాళ్లపై నిలిచిపోయింది. 12 గంటలపాటు భయంతో గడిపిన సిబ్బందిని.. రెస్క్యూ టీమ్ సేఫ్‌గా తీరానికి చేర్చింది. ఇప్పుడు ఆ నౌక ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా, మీమర్స్ సర్కాస్టిక్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
నీటి అడుగున ఉన్న రీఫ్‌తో ఢీకొట్టడంతో మోటార్ క్రూయిజర్.. జెర్సీ తీరంలోని ఎక్రెహస్ రీఫ్ మధ్య ఉన్న రాళ్లపై, నీటి ఉపరితల మట్టానికి 10 అడుగుల ఎత్తులో ఇరుక్కుపోయింది. ఆ రాళ్లపై ఓ విగ్రహం మాదిరి నిలిచిపోవడంతో ఇందులోని సిబ్బంది చాలా గంటలపాటు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్‌స్టిట్యూషన్(RNLI)కు చెందిన కోస్ట్‌గార్డ్‌లు వచ్చి వారిని రక్షించగా, ఇరుక్కుపోయిన మోటార్ బోట్ తొలగించేందుకు 12 గంటల పాటు శ్రమించారు.