- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏటేటా పెరుగుతున్న అప్పు
దిశ, న్యూస్ బ్యూరో: అప్పు చేసి పప్పు కూడు.. అనే సామెత తెలుగు సమాజంలో కొత్తదేమీ కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా అలానే తయారైంది. అప్పులు చేయడం తప్పేమీకాదని, అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలూ ఇదే చేస్తాయని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా సమర్ధించుకుంటున్నారు. కానీ గడచిన ఆరేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, కొన్ని తీర్చగా ఇంకా రాష్ట్రం నెత్తిమీద ఉన్న అప్పు నాలుగు రెట్లు పెరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.61,711 కోట్లు ఉంటే ఇప్పుడు అది రూ. 2.29 లక్షల కోట్లకు చేరుకుంటోంది. రాష్ట్ర మొత్తం జీఎస్‌డిపిలో ఏటేటా అప్పుల శాతం పెరుగుతూనే ఉంది. అప్పు రూపంలో సమకూర్చుకుంటున్న ఆదాయాన్ని తిరిగి రాష్ట్రంలో సంపద సృష్టించడానికే ఖర్చు (కాపిటల్ ఎక్స్‌పెండిచర్) చేస్తున్నామని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. కానీ కమీషన్ల కోసమే ఇలాంటి ప్రాజెక్టులపై ఖర్చు పెడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా అప్పులు మాత్రం ఏటేటా పెరిగిపోవడం చివరకు ప్రజల నెత్తిన ఏ బాంబు రూపంలో పేలుతుందో అనే భయాలూ లేకపోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో సింహభాగం బహిరంగ మార్కెట్ల ద్వారా (వయా రిజర్వుబ్యాంకు) చేస్తున్నదే. మరికొంత కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటోంది. ఇంకొంత హడ్కో, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థల ద్వారా సమకూర్చుకుంటోంది. వీటిపై వడ్డీ చెల్లింపు కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకే రిజర్వు బ్యాంకు ద్వారా సమకూర్చుకుంటున్న రుణాలను ఇంతకాలం గరిష్ఠంగా 8 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటే గత నాలుగైదు నెలలుగా మాత్రం ఏకంగా 40 ఏళ్ళ కాలపరిమితిలో తిరిగి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటోంది.
2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు రూ. 1.52 లక్షల కోట్లు. ఆ తర్వాతి సంవత్సరం ఇది రూ. 1.75 లక్షల కోట్లకు పెరిగింది. ఆ తర్వాతి సంవత్సరం (2019-20) నాటికి ఇది రూ. 1.99 లక్షల కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఇది ఏకంగా రూ. 2.29 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అంటే మొత్తం బడ్జెట్ సైజుకంటే అప్పులే ఎక్కువగా ఉంటున్నాయి. వీటి మీద చెల్లించే వడ్డీ కూడా ప్రతీ ఏటా ప్రభుత్వానికి భారంగా మారుతోంది. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర మొత్తం జీఎస్‌డీపీలో అప్పుల వాటా సుమారు 21%గా ఉంటుంది. రాష్ట్రం అప్పుల వివరాలు :
2017-18 రూ. 1,52,190 కోట్లు
2018-19 రూ. 1,75,281 కోట్లు
2019-20 రూ. 1,99,215 కోట్లు
2020-21 రూ. 2,29,205 కోట్లు
tags: Telangana, Budget, Loans, Borrowings, GSDP, Debt