అక్కడ అమ్మాయి నచ్చిందా..? కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవచ్చు

by vinod kumar |
అక్కడ అమ్మాయి నచ్చిందా..? కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవచ్చు
X

దిశ,వెబ్‌డెస్క్: పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. రెండు మ‌న‌సులు జీవిత‌కాలం ఒక‌రినొక‌రు క‌లిసి జీవించే మ‌హ‌త్తర ఘ‌ట్టం. అలాంటి పెళ్లి తంతు చాలా విచిత్రంగా జరుగుతుంది.

ఆగ్నేయాసియాలోని మోంగ్, మెక్సికోలోని జెల్టాల్, ఐరోపాలోని రోమాని, అమెజాన్ అడవుల్లోని కొన్ని తెగల్లో చాలా రేర్ గా నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేవారు. కానీ కాకసస్ మరియు మధ్య ఆసియాలో సర్వ సాధారణం. పూర్వం కాకసస్, ఆసియా దేశాల్లో రెండు సాంప్రదాయాల్లో వధువును కిడ్నాప్ చేసేవాళ్లు. ఒక వధువును ఒక వరుడు అతని స్నేహితులు మరియు బంధువులు అపహరించే వారు. రెండో సాంప్రదాయంలో అబ్బాయిలే గ్రూప్ గా ఏర్పడి అమ్మాయిల్ని అపహరించేవారు. ఆ కిడ్నాప్ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. సెంట్రల్ ఏసియా దేశాల‌కు చెందిన కిర్గిజిస్తాన్ లో ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అబ్బాయిల‌కు త‌మ‌కు న‌చ్చిన అమ్మాయిని సెల‌క్ట్ చేసుకోమ‌ని కుటుంబ‌ స‌భ్యులు ప్రోత్సహిస్తారు. అంతేకాదు ఆ అమ్మాయి ఎవ‌రైనా స‌రే న‌చ్చిందంటే అబ్బాయే .., అమ్మాయిని కిడ్నాప్ చేయించి త‌న త‌ల్లిదండ్రుల‌కు అప్పగిస్తాడు. దీంతో కాబోయే వ‌రుడు త‌ల్లిదండ్రులు ఆ అమ్మాయికి, ఆమె కుటుంబ‌ స‌భ్యుల‌కు నచ్చ జెప్పించి పెళ్లి జ‌రిపిస్తారు.

వధువును ఎందుకు కిడ్నాప్ చేస్తారు?

పెళ్లి తరువాత వధువు తన అత్తింటివారిని ఇబ్బంది పెట్టకూడదనే ఇలా కిడ్నాప్ చేస్తున్నట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. దీంతో పాటు వరుడు పెళ్లి తరువాత తన భార్యతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లడం ద్వారా త్వరగా సంతానం కలుగుతుందనే అక్కడి ప్రజల నమ్మకం.

కిడ్నాప్ పెళ్లి వధువుకు ఇష్టమేనా?

కిడ్నాప్ చేసుకోవడం పెళ్లి చేసుకోవడం వధువుకు ఇష్టమేనా? అంటే అవుననే అంటున్నారు వధువులు. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం వల్ల చదువుతో సంబంధం ఉండదు. పైగా కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులకు ఎలాంటి సమస్యలు తలెత్తవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సాంప్రదాయం వల్ల బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తద్వరా చిన్నవయస్సుల్లో పెళ్లి చేసుకొని తమ జీవితాల్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed