ఐపీఎల్‌ను ఆదాయ వనరుగా రాయొద్దు.. మీడియా సంస్థలను తప్పుబట్టిన ధుమాల్

by Shyam |
ఐపీఎల్‌ను ఆదాయ వనరుగా రాయొద్దు.. మీడియా సంస్థలను తప్పుబట్టిన ధుమాల్
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)ను ఒక ఆదాయ వనరుగా మీడియా సంస్థలు రాయడాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తప్పుబట్టారు. పదే పదే దీన్ని ఒక మనీ మెషిన్‌గా సంబోధించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ ద్వారా సమకూరే ప్రతి రూపాయీ తిరిగి క్రికెట్ కోసం, దేశ పునర్నిర్మానం కోసం ఖర్చు పెడుతున్నామే తప్ప.. బీసీసీఐ పదవుల్లో ఉన్న వారి జేబుల్లోకి పోవట్లేదని అన్నారు. క్రిక్‌బిజ్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమల్ మాట్లాడుతూ.. అన్ని రకాలుగా సురక్షితం అని నిర్ధారించుకున్న తర్వాతే ఐపీఎల్ నిర్వహిస్తామన్నారు. ఆటగాళ్లు కూడా క్రికెట్ నుంచి ఎన్ని రోజులని దూరంగా ఉంటారని ప్రశ్నించారు. ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం క్రికెటర్లకే పోతుంది కానీ బీసీసీఐలోని వ్యక్తులకు కాదని అన్నారు. భారత ప్రభుత్వానికి బీసీసీఐ ప్రతి ఏడాదీ వేలకోట్ల రూపాయలను పన్నుల రూపంలో చెల్లిస్తున్నది. ఈ డబ్బందా దేశం కోసమే కదా వినియోగించేది. మరోవైపు టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు కూడా ఐపీఎల్ ద్వారా లాభం పొందుతున్నాయి. అంతేకానీ వచ్చే డబ్బంతా సౌరవ్ గంగూలీ, జై షా, అరుణ్ ధుమాల్ జేబుల్లోకి పోవట్లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story