- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా కరోనా ముప్పు..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి రికార్డు స్థాయిలో రికవరీలు పుంజుకుంటున్నప్పటికీ పెద్దమొత్తంలో ప్రజలు ఇంకా వైరస్ సోకే ముప్పును ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది. డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు ఐసీఎంఆర్ నిర్వహించిన దేశవ్యాప్త సీరో సర్వే అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలోని 21.5శాతం మంది మాత్రమే కరోనా వైరస్ ముప్పును ఎదుర్కొన్నారని సర్వేలో వెల్లడైందని తెలిపింది.
ఇంకా చాలా మంది వైరస్ నుంచి దూరంగానే ఉన్నారని, కాబట్టి టీకా పంపిణీ ప్రక్రియ తప్పనిసరిగా అవసరమని వివరించింది. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతున్నదని తెలిపింది. ప్రస్తుతం 5.42శాతంగా ఉన్నదని వివరించింది. 47 జిల్లాల్లో కొత్త కేసులు రిపోర్ట్ కాలేదని, 251 జిల్లాల్లో గత మూడువారాల్లో ఒక్క కరోనా మరణం సంభవించలేదని పేర్కొంది.