ఆ వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన డేల్ స్టెయిన్

by Shiva |
ఆ వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన డేల్ స్టెయిన్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ క్షమాపణలు కోరారు. ఐపీఎల్‌లో కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని.. అక్కడ ఆటకు విలువ లేదని.. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో అయితే ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు వస్తుందని వ్యాఖ్యానించాడు. స్టెయిన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఐపీఎల్‌లో ఆడి డబ్బు, పేరు సంపాదించి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు కూడా మండిపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న స్టెయిన్ క్షమాపణలు కోరాడు. ‘నా కెరీర్ ఐపీఎల్‌తోనే అద్భతంగా కొనసాగిందని చెప్పకపోయినా.. కించపరిచే మాటలు మాత్రం మాట్లాడలేదు. పీఎస్ఎల్, ఎల్‌పీఎల్‌లతో ఐపీఎల్‌ను ఎప్పుడూ పోల్చలేదు. నా మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ఐపీఎల్‌ను చులకన చేసిన మాట్లాడితే క్షమించండి’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటకు ముందే తాను ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనని స్టెయిన్ చెప్పాడు. ఇదే విషయం ఆర్సీబీకి కూడా తెలియజేసినట్లు ఆయన ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story