- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరపండి.. మావోయిస్టు జగన్ ప్రకటన
దిశ, భూపాలపల్లి: అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని ప్రతి ఆదివాసి గూడెంలో ఘనంగా జరుపుకోవాలని కొమరం భీం స్ఫూర్తితో స్వయం ప్రతిపత్తిని సాధించు కోవాలని మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఆదివాసీలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆగష్టు 9న ప్రపంచ వ్యాప్తంగా అదివాసుల హక్కుల పరిరక్షణ కోసం జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సభలు , సమావేశాలు నిర్వహించి ప్రజల్లో ఆదివాసీ హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభాలో 8.6 % ఆదివాసులున్నారని, సమాజ మూల వాసులైన వీరు జల్ , జంగల్ , జమీన్ లపై ప్రత్యేక సంబంధాలను కలిగి వీటిపై ఆధారపడి ఆదివాసీల జీవనం విధానం వైవిధ్య భరితంగా కొనసాగుతుందని,అందుకే ఆదివాసీ ప్రజలు స్వయం ప్రత్తి కోరుకంటున్నారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ఆదివాసీల చరిత్రలో రాజకీయ, ఆర్థిక స్వతంత్రతను దెబ్బతీసే కాకతీయ సామ్రాజ్యాన్ని తిరస్కరిస్తూ సాగిన సమ్మక్క , సారక్క నాయకత్వంలో జరిగిన పోరాటాలు మొదలుకొని 1940లో మా ఊళ్ళో మారాజ్యం అనే లక్ష్యంతో నైజం ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసేతర రాజకీయ , ఆర్థిక ఆదిపత్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు 1/70 చట్టం , పేస చట్టాలను , 5 వ , 6 వ షెడ్యూళ్ళ వంటి ఆదివాసీలకు హక్కులు కల్పించినప్పటికీ వాటిని అమలు చేయకుండా చట్టాలను తుంగలో తొక్కి భూస్వామ్య సామ్రాజ్యవాదుల దోపిడి అనుకూల విధానాలను అమలు చేస్తూ ఆదివాసీల స్వయం ప్రతిపత్తిపై నియంత్రణను కోల్పోయేటట్లు చేశారని ఆయన ఆరోపణలు చేశారు.
దీనితో ఆదివాసీలు స్వయం పత్తినే కాదు కనీస హక్కులను సైతం పూర్తిగా కోల్పోయారని, టీఆర్ఎస్ ప్రభుత్వం హరిత హారం పేరుతో ఆదివాసీల భూముల చుట్టూ బౌండరీలు వేసి తమ సొంత భూముల నుండి వెళ్ళ గొడుతున్నా విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గోదావరి నదిపై పోలవరం డ్యాం నిర్మాణంలో 75 గ్రామాలను ముంచారని, కాళేశ్వరం తుపాకుల గూడెం నీటి ప్రాజెక్టుల మూలంగా ఆదివాసి రైతులు వందల ఎకరాల సాగు భూములను కోల్పోయారని, కొమరం భీం జిల్లాల్లో కవ్వాల టైగర్ జోన్ ప్రాజెక్టుతో ఆదివాసీల ఇండ్లను ఖాళీ చేయించి బలవంతంగా వెళ్ళగొట్టారని మహబూబ్ నగర్ జిల్లాలో యూరేనియం తవ్వకాల కోసం , అభయారణ్యాల పేరుతో చెంచు ప్రజలను అడవుల నుండి గెంటివేసే ప్రయత్నాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని ఆయన తన ప్రకటనలో ఆరోపణ చేశారు.