- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ ఎన్నికలు : ప్రధాని సోదరుడి కుమార్తెకి చుక్కెదురు
దిశ,వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానిమోడీ సోదరుడి కుమార్తె సోనాల్ మోడీకి చుక్కెదురైంది.త్వరలో అహ్మదాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనాల్ మోడీ ప్రయత్నించారు. కానీ బీజేపీ పార్టీ కొత్తగా తెచ్చిన విధానాల వల్ల బోడక్ దేవ్ వార్డ్ నుంచి పోటీ చేయాలని భావించిన ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుమార్తె సోనాల్ అర్హత కోల్పోయారు. ప్రహ్లాద్ మోడీ రేషన్ షాపును నిర్వహిస్తున్నారు.గుజరాత్ రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే గృహిణిగా ఉన్న ప్రహ్లాద్ మోడీ కుమార్తె సోనాల్ మోడీ పేరు తాజాగా విడుదల చేసిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బీజేపీ అభ్యర్ధుల జాబితాలో లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు అహ్మదాబాద్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌పాటిల్ ను ప్రశ్నించగా.. ఇటీవల పార్టీ అధిష్టానం అభ్యర్ధుల ఎంపిక విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేసినట్లు చెప్పారు. బీజేపీలో ఉన్న పార్టీ నేతల కుటుంబసభ్యులకు, బంధువులు పోటీ చేయరాదంటూ పార్టీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉన్నట్లు తెలిపారు. కాబట్టే ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ కుమార్తె సోనాల్ మోడీ పేరును ప్రకటించలేదన్నారు.