- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తారా తీరం.. మాల్దీవుల్లో మస్తీ మజా!
దిశ, వెబ్‌డెస్క్: పర్యాటకుల భూతల స్వర్గంగా పేరొందిన మాల్దీవ్స్.. ప్రశాంతమైన సాగర తీరాలు, ప్రకృతి అందాలు, పరుచుకున్న ఇసుక తెన్నెలకు కేరాఫ్ అడ్సస్. పర్యాటకులకే కాదు, సినీ తారలకు కూడా ఇదే ఫేవరెట్ స్పాట్. నిత్యం షూటింగ్స్‌తో బిజిబిజీగా గడిపే సినీ తారలంతా మాల్దీవుల్లో సేద తీరుతుంటారు. లాక్‌డౌన్ కారణంగా చాలారోజులుగా ఇంటికే పరిమితమైపోయిన సెలెబ్రిటీలంతా ఇప్పుడు రిఫ్రెష్‌మెంట్ కోసం పర్యాటక ప్రాంతాల బాట పడుతున్నారు. హనీమూన్ కపుల్స్, యంగ్ బ్యూటీస్ కూడా ఇప్పుడు చలో మాల్దీవ్స్ అంటున్నారు.
రీసెంట్‌గా అందాల తార తాప్సీ మాల్దీవుల్లో గడిపి వచ్చిన విషయం తెలిసిందే. కత్రినా కైఫ్, మెహ్రీన్, వేదికతో పాటు బాలీవుడ్ హాట్ కపుల్స్ నేహా దూపియా, అంగద్ బేడీలు సైతం ఆ స్వర్గధామంలో ఎంజాయ్ తిరిగి రాగా, తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ కూడా తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి హనీమూన్‌కు అక్కడికే వెళ్లింది. టాలీవుడ్ అందాల తార ప్రణీత సుభాష్.. ఇటీవలే తన స్నేహితురాలు మధుతో కలిసి సముద్ర తీరాల్లో చక్కర్లు కొట్టింది. స్టార్ హీరోయిన్ రకుల్ తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో వెకేషన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇక బాలీవుడ్ నటి తార సుతారియా తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను బాయ్‌ఫ్రెండ్ అదార్ జైన్ (రణ్‌బీర్ కపూర్ కజిన్)తో మాల్దీవుల్లోనే జరుపుకుంది. అయితే, వీరిద్దరూ సీక్రెట్ మెయింటైన్ చేస్తుండటం విశేషం. సుతారియా తను సింగిల్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తుండగా, ఇటు అదార్ సైతం తను ఒక్కడే నీలి సముద్రాల అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను పంచుకున్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా ప్రస్తుతం మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ.. నేచర్‌తో పోటీపడుతూ తను దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఇలా తాము మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తున్నారు.