- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాలుగు చానల్స్‌లో సాలిడరిటీ కప్ ప్రత్యక్ష ప్రసారం

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ అంటేనే అందరూ ట్యూన్ చేసే చానల్ స్టార్ స్పోర్ట్స్. టీమ్‌ఇండియా ఆడే మ్యాచ్‌ల ప్రసార హక్కులను రూ.కోట్లకు కొనుగోలు చేసి అంతకు రెండింతలు లాభాలు ఆర్జించే స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో నాలుగు నెలలుగా ప్రత్యక్ష ప్రసారాలు లేకుండా పోయాయి. భారత్ ఆడే మ్యాచ్‌లతోపాటు ఐసీసీ ఈవెంట్లు ఏవీ లేకపోవడంతో క్రికెట్ మ్యాచ్‌లను స్టార్‌లో చూసే అవకాశం పోయింది. కానీ, ఆ లోటు శనివారం తీరనున్నది. క్రికెట్ సౌత్ ఆఫ్రికా సరికొత్త 3టీ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న సాలిడరిటీ కప్‌ను స్టార్‌స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ఈ మ్యాచ్‌ను నాలుగు ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీల్లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతేకాకుండా స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ ఛానల్స్‌లో హిందీ వ్యాఖ్యానంతో ప్రసారం కానుంది.