పారాసైట్ విషయంలో విమర్శలపై జక్కన్న క్లారిటీ…

by Shyam |
పారాసైట్ విషయంలో విమర్శలపై జక్కన్న క్లారిటీ…
X

దర్శకధీరుడు రాజమౌళి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న పారాసైట్ సినిమా పై చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. ఆస్కార్ విన్నింగ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోగా… ఆ సినిమా చాలా బోర్ అని… చూస్తుంటే నిద్ర వచ్చిందని కామెంట్ చేశాడు జక్కన్న. దీంతో సోషల్ మీడియాలో జక్కన్న పై భారీ ట్రోల్స్ వచ్చాయి. అసలు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? ఎందుకు అంత అసూయ? అంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

ఒక సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం అని.. దానికి ఇంతలా విమర్శించాల్సిన పని లేదన్నాడు. గతంలోనూ నాకు ఆస్కార్ గెలుచుకున్న వాటిలో కొన్ని మూవీస్ చాలా నచ్చితే… కొన్ని మాత్రం అసలు నచ్చలేదని చెప్పాడు. అయితే జ్యూరీ సభ్యులు ఒక సినిమా చూడాలి .. దాని గురించి చర్చించి… అవార్డు ఇవ్వాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుందని అన్నారు జక్కన్న. కానీ ఒక సినిమాను అవార్డుకు సెలెక్ట్ చేయడం… దానిని ఫైనల్ చేయడం వంటి విషయాల మీద తనకు అవగాహన లేదని చెప్పాడు. కానీ సినిమా నచ్చడం నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం అనేది అందరూ అర్ధం చేసుకోవలసి ఉందన్నారు. ప్రస్తుతం RRR సినిమా చేస్తున్న జక్కన్న… లాక్ డౌన్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభించి తొందరగా చిత్రీకరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కాగా జనవరి 8న విడుదల కావాల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.

Tags: SS Rajamouli, NTR, Ram Charan Teja, RRR, DVV, Parasite

Advertisement

Next Story

Most Viewed