ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ 2021 నోటిఫికేషన్

by Harish |   ( Updated:2021-02-16 07:10:15.0  )
ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ 2021 నోటిఫికేషన్
X

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ దేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ -సి నాన్‌గెజెటెడ్, నాన్-మినిస్టీరియల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ (నాన్- టెక్నికల్ స్టాఫ్)

పోస్టుల సంఖ్య: 8100(సుమారుగా)

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

వయస్సు: 1 జనవరి, 2021 నాటికి వివిధ విభాగాలను అనుసరించి 18 నుంచి 25 ఏండ్ల మధ్య, లేదా 18 నుంచి 27ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేసిక్ రాత పరీక్ష (టైర్ I & టైర్ II) ద్వారా టైర్ I పరీక్ష విధానంలో భాగంగా రెండు పేపర్లల్లో పేపర్ 1 ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది.

పేపర్ 1 పరీక్ష మొత్తం 100 మార్కులు ఉంటుంది. మొత్తం 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 0.25శాతం లేదా 1/4 మార్కులను తగ్గిస్తారు.
పరీక్ష విధానం

జనరల్ ఇంగ్లీష్ : 25 ప్రశ్నలు 25 మార్కులు

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 25 ప్రశ్నలు – 25 మార్కులు

న్యూమరికల్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలకు 25 మార్కులు

జనరల్ అవేర్నెస్: 25 ప్రశ్నలకు 25 మార్కులు
పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. షార్ట్ ఎస్సే ఆన్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ రాయాల్సి ఉంటుంది. రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో (తెలుగు)తో సహా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 30 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: 21, మార్చి, 2021( రాత్రి 11:30గంటల వరకు)

ఆన్‌లైన్ ఫీజు పేమెంట్‌కు చివరి తేదీ: 23, మార్చి, 2021( రాత్రి 11:30గంటల వరకు)

చలాన్ జనరేషన్‌కు చివరి తేదీ: 25, మార్చి 2021( రాత్రి 11:30గంటల వరకు)

చలాన్ పేమెంట్‌కు చివరి తేదీ: 29, మార్చి 2021

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ 1): జూలై నుంచి 20, 2021
టైర్ II ఎగ్జామినేషన్: 21, నవంబర్, 2021

వెబ్‌సైట్: https://ssc.nic.in

మరిన్ని ఉద్యోగాల వివరాల కోసం క్లిక్ చేయండి

సెక్యూరిటీ పేపర్ మిల్లులో సూప‌ర్‌ వైజ‌ర్లు

Advertisement

Next Story

Most Viewed