- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈనాడు’
దిశ ఏపీ బ్యూరో: రామోజీరావు దృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దు.. వాస్తవాలు వెల్లడించండి అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల అధినేతకు హితవు పలికారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం కులం, మతం చూడకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తోందని చెప్పారు. అయినా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చూడకుండా ఈనాడులో వార్తలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. కరోనా విషయంలో ఏపీకి ఒకలా, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మరోలా ఈనాడులో వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈనాడు, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. కరోనా ఆరు నెలల్లో ప్రజా శ్రేయస్సు కోసం 28,122 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. 108 వాహనాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 108, 104లను పూర్తిగా నిర్వీర్యం చేసిన టీడీపీ, ఇప్పుడు 108 వాహనాల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహణ అంతా పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు.