- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలంకలో పర్యటించనున్న ఇంగ్లాండ్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : కోవిడ్ మహమ్మారి కారణంగా శ్రీలంకలో జరగాల్సిన పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయ్యాయి. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం మార్చిలో జరగాల్సిన టెస్టు సిరీస్ వాయిదా వేసింది. తాజాగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2021 జనవరిలో నిర్వహించనున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. కరోనా కారణంగా రెండు టెస్టులను కూడా కొలంబోలోని గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 14-18 వరకు తొలి టెస్టు, జనువరి 22-26 వరకు రెండో టెస్టు జరుగనున్నది. ఇప్పటికే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడింది. దీంతో శ్రీలంక బోర్డుకు చాలా నష్టం వచ్చింది. తాజాగా ఇంగ్లాండ్ పర్యటన ద్వారా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించి ఖజానాను నింపుకోవాలని బోర్డు భావిస్తున్నది.
Advertisement
Next Story