- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నివారణకు స్ప్రే
దిశ, న్యూస్‌బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ప్రధాన రహదారుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తుంది. ఇందులో భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఈ.వీ.డీ.యం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్‌లోని తార్నాక, మౌలాలి నేరెడ్మెట్, యాప్రాల్, సైనిక్‌పురి, హౌసింగ్‌బోర్డ్ కాలనీలలో పర్యటించి పారిశుధ్య పనులు, హైప్రెజర్ జెట్టింగ్ మిషన్లతో సోడియం హైపోక్లోరైట్ పిచికారిని పరిశీలించారు. మార్కెట్లు, దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనేటప్పుడు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. అధికారులు, కార్పొరేటర్లు ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని వారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాప్రా డీసీ శైలజ, కార్పొరేటర్లు అలకుంట్ల సరస్వతి, గోళ్ళూరి అంజయ్య, శ్రీదేవి, స్వర్ణరాజ్ పాల్గొన్నారు.