- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంగ్లాండ్ గడ్డపై రెచ్చిపోతున్న చాహల్.. ఖాతాలో ఐదు వికెట్లు
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇంగ్లాండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న అతను డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మంగళవారం ఐదు వికెట్లు(5/45) పడగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్‌ను చాహల్ స్పిన్‌తో బెంబేలెత్తించాడు. దీంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో డెర్బీషైర్ 150/4 స్కోరుతో మంచి స్థితిలోనే ఉండగా చాహల్ వరుస వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే ప్రత్యర్థిని కూల్చేశాడు. 16.3 ఓవర్లు వేసిన చాహల్ 2.73 ఎకానమీతో 45 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 178/5 స్కోరు చేసి.. 232 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.