ముంబైలో ఇల్లు కొన్న జైశ్వాల్.. అంత పెట్టి కొన్నాడా?

by Harish |
ముంబైలో ఇల్లు కొన్న జైశ్వాల్.. అంత పెట్టి కొన్నాడా?
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ ప్రపంచంలో టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ పేరు మారుమోగుతున్నది. ఇంగ్లాండ్‌పై వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు బాదడంతో ఇప్పుడంతా ఈ ముంబై బ్యాటర్ గురించే చర్చ. గతేడాది వెస్టిండీస్‌పై టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జైశ్వాల్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు కీలక ఆటగాడిగా మారాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన జైశ్వాల్.. ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు.

ఇటీవల జైశ్వాల్ ముంబైలో ఓ ఇల్లు కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఇల్లు ధర వింటే కచ్చితంగా వామ్మో అంటారు. అక్షరాలా 5 కోట్ల రూపాయలు. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లో అతను ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. టెన్ బీకేసీ ప్రాజెక్ట్‌ అపార్ట్‌మెంట్‌లో 1,110 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకోసం అతను రూ.5.38 కోట్లు వెచ్చించాడని, గత నెల 7న రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ముంబైకి వచ్చిన మొదట్లో జైశ్వాల్ కుటుంబం ఓ చిన్న డేరాలో నివాసముండేది. ఐపీఎల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన జైశ్వాల్.. తక్కువ సమయంలోనే క్రికెట్ ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జైశ్వాల్ రికార్డుల మీద రికార్డుల బద్దలు కొడుతున్నాడు. వైజాగ్, రాజ్‌కోట్ టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు బాది టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సిరీస్‌లో 545 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed