WTC Final : మరికాసేపట్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్

by Sathputhe Rajesh |
WTC Final : మరికాసేపట్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో టీమిండియా, అస్ట్రేలియా జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 2013 లో ఛాంపియన్స్ ట్రోపీ ద్వారా చివరిసారిగా ఐసీసీ టోర్నీ సాధించింది. అప్పటి నుంచి దశాబ్దకాలంగా ఐసీసీ టోర్నీ అనేది టీమిండియాకు కలగానే మిగిలిపోతోంది.

వరుసగా రెండోసారి టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. గతసారి న్యూజిలాండ్ చేతిలో ఛాంపియన్ షిప్ కోల్పోయిన భారత జట్టు ఈసారి అంతకంటే కఠినమైన ఆస్ట్రేలియాను ఏ రీతిలో కట్టడిచేయబోతున్నదనేది ఉత్కంఠ రేపుతోంది. స్టార్లతో కూడిన ఆస్ట్రేలియా ఈసారి తమకు ప్రత్యర్థిగా ఉన్నా ఈ దఫా టెస్టు గదను చేజారనీయవద్దనే కసితో టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియాతో ఆడిన చివరి నాలుగు టెస్టు సిరీస్ ల్లోనూ భారత్ దే విజయం కావడంతో నేటి మ్యాచ్ కూడా తమదే అనే ధీమా ఇండియన్ క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed