- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
WTC FINAL : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు నెగ్గాలో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25రేసులో టీమిండియానే ముందుంది. వరుసగా మూడోసారి ఫైనల్ బెర్త్ ఖాయమే అనుకున్నారంతా. కానీ, ఒక్కసారిగా అంతా తారుమారైంది. న్యూజిలాండ్ చేతిలో అవమానకర ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ప్రమాదంలో పడింది. టాప్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయిన రోహిత్ సేనకు ఫైనల్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇతర జట్లు ముందుకు రావడంతో టీమిండియాకు ఫైనల్ రేసులో సవాళ్లు తప్పవు. ఈ క్రమంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే రోహిత్ సేనకు ముందు ఉన్న దారి ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటాడమే.
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత్ 74.24 శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్నది. అయితే, సొంతగడ్డపై కివీస్ విజృంభణను రోహిత్ సేన అడ్డుకోలేకపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయ్యింది. దీంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం 58.33 శాతంతో రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 62.50 శాతంతో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఆ తర్వాత శ్రీలంక(55.56), న్యూజిలాండ్(55.56), సౌతాఫ్రికా(54.17) వరుసగా 3వ, 4వ, 5వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ సిరీస్ ఓటమితో ఆ జట్ల ఫైనల్ అవకాశాలు మెరుగయ్యాయి. దీంతో టాప్-2లో చోటు కోసం భారత్‌కు ఆయా జట్ల నుంచి పోటీ తప్పదు. వాటిని దాటుకుని ఫైనల్ బెర్త్ సాధించడం రోహిత్ సేనకు సవాల్‌తో కూడుకున్నదే.
ఆస్ట్రేలియాలో నాలుగు గెలిస్తేనే..
డబ్ల్యూటీసీ 2023-25 సర్కిల్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా పర్యటననే చివరిది. ఈ నెలాఖరులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్‌తో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. కివీస్ చేతిలో 3-0తో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత్‌కు ఆసిస్ పర్యటన అత్యంత కీలకంగా మారింది. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆసిస్ గడ్డపై ఐదింటికి ఐదు మ్యాచ్‌లు నెగ్గాల్సిందే. కనీసం నాలుగైనా గెలవాలి. మరోటి డ్రా చేసుకోవాలి. అప్పుడు భారత్ పాయింట్స్ పర్సంటేజ్ 65 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. పాయింట్స్‌లో ఎలాంటి కోత లేకపోతేనే. ఆసిస్ టూరులో సత్తాచాటితే భారత్ కాకుండా ఇతర జట్లలో సౌతాఫ్రికా, శ్రీలంకలకు మాత్రమే అగ్రస్థానం పొందే అవకాశం ఉంది. తమ మిగతా మ్యాచ్‌ల్లో నెగ్గితే దక్షిణాఫ్రికా 69.4 శాతం, శ్రీలంక 69.2 శాతం పొందొచ్చు. అదే జరిగితే భారత్ రెండో స్థానంతో ఫైనల్‌కు చేరుకోవచ్చు.
ఇలా అయితే అద్భుతమే జరగాలి
ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో 3-2తో సిరీస్‌లో ఓడినా భారత్‌కు ఫైనల్ చాన్స్ ఉంది. కానీ, అద్భుతమే జరిగితేనే టీమిండియాకు బెర్త్ దక్కుతుంది. ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ 1-1తో సిరీస్‌ను డ్రా చేసుకోవాలి. అలాగే, సౌతాఫ్రికా సొంతగడ్డపై శ్రీలంక, పాక్‌తో జరిగే సిరీస్‌లను 1-1 చొప్పున డ్రా చేసుకోవాలి. ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్ 0-0తో ముగియాలి. అప్పుడు ఆసిస్(58.77 శాతం) అగ్రస్థానంలో నిలువగా.. భారత్(53.51 శాతం) రెండో స్థానంతో ఫైనల్‌కు చేరుకోవచ్చు. ఇలా జరగడం అంత సులభం కాదు. అలా కాకుండా ఆసిస్‌పై 4 విజయాలు, ఒక్క డ్రా సాధిస్తే భారత్ ఎలాంటి అడ్డంకి లేకుండా ఫైనల్‌కు చేరుకోవచ్చు.