- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత
దిశ, స్పోర్ట్స్ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన నిషేధాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) ఎత్తివేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో గతేడాది ఆగస్టు 23న డబ్ల్యూఎఫ్‌ఐపై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల సస్పెన్షన్‌పై చర్చించిన రెజ్లింగ్ వరల్డ్ గవర్నింగ్ బాడీ మంగళవారం నిషేధం ఎత్తివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘యూడబ్ల్యూడబ్ల్యూ బ్యూరో ఫిబ్రవరి 9న సమావేశమైంది. సస్పెన్షన్, ఇతర విషయాలపై చర్చించింది. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.’అని యూడబ్ల్యూడబ్ల్యూ తెలిపింది. పలు షరతులతో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది. ‘డబ్ల్యూఎఫ్‌ఐ అథ్లెట్ల కమిషన్‌కు ఎన్నికలు నిర్వహించాలి. అభ్యర్థులు క్రియాశీలక అథ్లెట్లు లేదా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగేళ్లకు మించన వారు అయి ఉండాలి. అథ్లెట్లే ఓటర్లుగా ఉండాలి. ఈ ఎన్నికలు ట్రయల్స్ సమయంలో లేదా ఏదైనా సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్ జరిగేటప్పుడు నిర్వహించాలి. జూలై 1 కంటే ముందు ఎన్నికలు జరగాలి.’ అని పేర్కొంది. అలాగే, రెజ్లర్లపై వివక్ష చూపించకుండా అందరినీ ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ ఈవెంట్లకు పరిగణించాలని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకు భారత రెజ్లింగ్ సమాఖ్య రాతపూర్వక హామీ ఇవ్వాలని పేర్కొంది. మాజీ అధ్యక్షుడుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రెజ్లర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ ఎత్తివేయడంతో పారిస్ ఒలింపిక్స్‌తోసహా ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు తమ దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. మరోవైపు, గతేడాది డిసెంబర్‌లో డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు జరగగా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త పాలకవర్గాన్ని సస్పెండ్ చేసింది.
- Tags
- #WFI