బీసీసీఐకి బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్‌కి పాక్ దూరం..!

by Vinod kumar |
బీసీసీఐకి బిగ్ షాక్.. వన్డే వరల్డ్ కప్‌కి పాక్ దూరం..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో పాక్ జట్టు పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టోర్నీలో పాల్డొనడంపై పాక్ క్రికెట్ బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. పీసీబీ ఇప్పటి వరకు ఎలాంటి లిఖితపూర్వక కమిట్‌మెంట్ ఇవ్వలేదని ఐసీసీ బోర్డు అధికారి ఒకరు వార్త సంస్థ పీటీఐకి తెలిపారు. "టీమిండియా.. పాకిస్థాన్ వెళ్లడం, పాకిస్థాన్ టీమ్ భారత్‌కు రావడం అనేది పీసీబీ, బీసీసీఐ‌లపై ఆధారపడి ఉంది. వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే విషయంపై పీసీబీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీసీసీఐ తరహాలోనే ఆ జట్టు పాల్గొనడంపై పాక్ ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంది. ఆ దేశ ప్రభుత్వ అనుమతికి లోబడి మాత్రమే పీసీబీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది." అని అధికారి వెళ్లడించాడు.

మరోవైపు ఆసియాకప్ 2023 నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీని పాకిస్థాన్‌ నిర్వహించాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలు, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వెళ్లేందుకు భారత్‌ ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆసియాకప్ 2023ను శ్రీలంకకు తరలించే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని పీసీబీ భావిస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఆసియాకప్ 2023 టోర్నీని రద్దు చేసి మల్టీ నేషనల్ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆసియాకప్ నిర్వహణపై స్పష్టత వచ్చిన తర్వాతే పీసీబీ.. వన్డే ప్రపంచకప్ ఆడటంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed