U19 Women's T20 World Cup : లంకపై భారత్ ఘన విజయం

by Vinod kumar |
U19 Womens T20 World Cup : లంకపై భారత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల U-19 వరల్డ్ కప్‌లో భారత్ టీమ్ మరో విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ జట్టు.. శ్రీలంక జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో పర్సవీ 4 వికెట్లు తీయగా.. మనాత్ కశ్యప్ 2 వికెట్లు.. అర్చనా దేవి, సాదు తలో వికెట్ తీశారు. అనంతరం 60 పరుగుల స్వల్ప స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్‌లో సౌమ్య తివారి(28) నాటౌట్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ(15) రాణించగా.. భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్ జట్టు సూపర్ గ్రూప్-1 లో రెండో స్థానానికి చేరింది.

Advertisement

Next Story