ఒలంపిక్స్ లో తీవ్ర విషాదం.. ప్రాణాపాయ స్థితిలో మహిళా రెజ్లర్

by M.Rajitha |
ఒలంపిక్స్ లో తీవ్ర విషాదం.. ప్రాణాపాయ స్థితిలో మహిళా రెజ్లర్
X

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం జరిగిన76 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రొమేనియా రెజ్లర్ కాటలీనా ఆక్సన్టే, తన ప్రత్యర్థి అమెరికాకు చెందిన కెన్నెడీ బ్లేడ్స్ తో పోటీ పడింది. కెన్నెడీ కాటలీనాను వెనక్కి విసరడంతో ఆమె బలంగా నేలను తాకి, వేదికపైనే కుప్పకూలి, విలవిలాలాడింది. వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కాటలీనా కదలలేక పోయింది. వెంటనే ఆమెను ఒలంపిక్ గ్రామం నుండి అత్యాధునిక చికిత్స కోసం పారిస్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుండి ఆమె కోలుకోడానికి ఏడాదికి పైగా పడుతుందని సమాచారం. కాగా కాటలీనా రెండుసార్లు యూరోపియన్ చాంపియన్షిప్ కాంస్య పతకం సాధించింది.

Next Story

Most Viewed