- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అవసరం లేదు : అసిస్టెంట్ కోచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్ నాయకత్వంలో ప్రకటించిన భారత జట్టుకు బీసీసీఐ వైస్ కెప్టెన్‌ను నియమించలేదు. దీనిపై తాజాగా టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. భారత టెస్టు జట్టుకు ప్రత్యేకంగా వైస్ కెప్టెన్‌ను నియమించాల్సిన అవసరం లేదన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న వారు చాలా మంది జట్టులో ఉండటమే అందుకు కారణమని చెప్పాడు. ‘భారత జట్టులో చాలా మంది ఐపీఎల్ కెప్టెన్లు ఉన్నారు. పంత్, గిల్ ఐపీఎల్‌లో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. యశస్వి జైశ్వాల్ కూడా కెప్టెన్ అవ్వొచ్చు. వారి వయసు, ఆడిన క్రికెట్ దృష్ట్యా వారు యువకులే కావొచ్చు. కానీ, నేను వాళ్లను యువకులుగా చూడను. వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే వైస్ కెప్టెన్‌ను నియమించాల్సిన అవసరం లేదు. విరాట్, రోహిత్‌లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం ద్వారా యువకులు మరింత వేగంగా నేర్చుకుంటున్నారు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రాకు డిప్యూటీ బాధ్యతలు అప్పగించగా.. ఇటీవల పరిమిత ఓవర్ల జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే, బంగ్లాతో సిరీస్‌కు మాత్రం ఎవరినీ రోహిత్‌కు డిప్యూటీగా ఎంపిక చేయలేదు.
- Tags
- #ind vs ban