- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paris olympics : తొలి పతకం, మొదటి బంగారు పతకం గెలిచిందెవరో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. శనివారం పలు క్రీడల్లో పతక ఈవెంట్లు జరిగాయి. మరి, ఈ విశ్వక్రీడల్లో తొలి పతకం, మొదటి బంగారు పతకం ఎవరు గెలిచారో తెలుసా?.. తొలి పతకం కజకస్థాన్ ఖాతాలోకి వెళ్లగా.. మొదటి స్వర్ణ పతకం చైనా దక్కించుకుంది. షూటింగ్‌లో కజకస్థాన్ షూటర్లు అలెగ్జాండ్రా లే, ఇస్లాం సత్పయేవ్ తొలి పతకం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఈ జోడీ కాంస్యం గెలిచింది. బ్రాండ్ మెడల్ మ్యాచ్‌లో కజకస్థాన్ జంట 17-5 తేడాతో జర్మనీకి చెందిన అన్నా జాన్సెన్-మాక్సిమిలియన్ ఉల్బ్రిచ్ ద్వయంపై విజయం సాధించింది.
ఇక, మొదటి బంగారు పతకాన్ని ఇదే ఈవెంట్‌లో చైనా షూటర్లు హువాంగ్ యుటింగ్, షెంగ్ లిహావో దక్కించుకున్నారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనా జంట 16-12 తేడాతో సౌత్ కొరియా జోడీ కెయుమ్ జిహ్యోన్-పార్క్ హజున్‌లపై గెలుపొందింది. ప్రస్తుతం మెడల్ టేబుల్‌లో చైనా రెండు స్వర్ణ పతకాలతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత సౌత్ కొరియా, అమెరికా చెరో రజతంతో రెండో స్థానాన్ని పంచుకున్నాయి.
- Tags
- #Paris olympics