- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ దూరంగా ఉండటంలో మర్మమేంటి?
దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం విరాట్ కోహ్లీ గురించే చర్చ. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న అతను మిగతా సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. అతను దూరంగా ఉండటానికి నిర్దిష్ట కారణం అతని భార్య అనుష్క ప్రెగ్నెంట్ కావడమేనని అందరూ అనుకున్నారు. ఈ విషయాన్ని కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వెల్లడించడంతో ఇదే నిజమని భావించారు. తాజాగా ఏబీడీ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకోవడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. విరాట్ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవడం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ మళ్లీ మొదలైంది.
ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో కోహ్లీ ఎంపికయ్యాడు. అయితే, తొలి టెస్టుకు ముందు అతను వ్యక్తిగత కారణాలతో రెండు టెస్టులకు దూరమయ్యాడని బీసీసీఐ వెల్లడించింది. అతని వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వాలని పేర్కొంది. అయితే, నిర్దిష్ట కారణం వెల్లడించలేదు. దీంతో అనేక పుకార్లు వచ్చాయి. మొదట కోహ్లీ తల్లి అనారోగ్యం బారిన పడ్డట్టు ప్రచారం జరిగినా.. ఆ వార్తలను కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ఖండించాడు. ఇటీవల ఏబీ డివిలియర్స్ విరుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని వెల్లడించడంతో కారణం తెలిసిందని అందరూ అనుకున్నారు. అయితే, తాజాగా తాను తప్పుడు సమాచారం ఇచ్చానని ఏబీడీ తెలిపాడు. దీంతో అనుష్క ప్రెగ్నెంట్ కాకపోతే కోహ్లీ సిరీస్‌కు ఎందుకు అందుబాటులో ఉండటం లేదనే చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై కోహ్లీగానీ, బీసీసీఐగానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు, ప్రస్తుతం విరాట్, అనుష్క దంపతులు విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబంతో గడిపేందుకే కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కోహ్లీకి దక్షిణాఫ్రికా మాజీ పేసర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్ మద్దతు పలికాడు. కోహ్లీ కుటుంబంతో ఉండాలనుకుంటే అందులో ఎలాంటి సమస్య లేదని, అన్నింటి కంటే కుటుంబమే ప్రధానమైనదని డేల్ స్టెయిన్ తెలిపాడు.
తప్పుడు సమాచారం ఇచ్చాను : ఏబీడీ
తాజాగా డివిలియర్స్ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నాడు. తప్పుడు సమాచారం ఇచ్చానని తెలిపాడు. ‘కచ్చితంగా కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాను. అదే సమయంలో పెద్ద తప్పు చేశాను. తప్పుడు సమాచారాన్ని మీతో షేర్ చేశాను. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విరాట్ విరామం తీసుకోవడానికి కారణమేదైనా.. అతను ఆరోగ్యంగా, మరింత దృఢంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా.’ అని తెలిపాడు.