- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వార్నర్ అప్పుడే రిటైర్ మెంట్ ప్రకటించాల్సింది: ఆసీస్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన సీనియర్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. కానీ అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా రాణించలేదు. తొలి రెండు టెస్టుల్లో చాలా పేలవమైన ప్రదర్వన చేశాడు. అదే సమయంలో బ్యాటింగ్ చేసే సమయంలో ఒక డెలివరీ వచ్చి అతని భుజాన్ని బలంగా తాకింది. దీంతో ఎక్స్‌రే తీయించగా వార్నర్ భుజం ఎముకపై చీలిక ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని మిగిలిన టెస్టుల నుంచి తొలగిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మూడో టెస్టులో అతని స్థానంలో ట్రావిస్ హెడ్ తుది జట్టులో ఆడించింది.
ఈ క్రమంలో వార్నర్ గైర్హాజరీలో ఓపెనర్ బాధ్యతలు నిర్వర్తించిన ట్రావిస్ హెడ్ ఇండోర్ పిచ్‌పై సరైన ఆటతీరు కనబరిచాడు. ఒక్క పరుగు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేలా కనిపించాడు. ఇది చూసిన చాలా మంది ఇక ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ ఏం చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. ఇక కనీసం టెస్టుల్లో అయినా అతన్ని తొలగించే సమయం వచ్చేసిందని అంటున్నారు. దీనిపై ఆసీస్ మాజీ లెజెండ్ రికీ పాంటింగ్ కూడా అదే భావన వ్యక్తం చేశాడు. వార్నర్ ఇక టెస్టులకు వీడ్కోలు చెప్పేస్తే మంచిదన్నాడు.
సిడ్నీ గ్రౌండ్‌లో డబుల్ సెంచరీ చేసినప్పుడే వార్నర్ రిటైర్ మెంట్ ప్రకటించాల్సిందని, కానీ ఇప్పటి వరకు అనవసరంగా పొడిగించాడని తెలిపాడు. అదేవిధంగా డబుల్ సెంచరీకి ముందే అతను తన 100వ టెస్టు కూడా ఆడాడని గుర్తు చేశాడు. ఇక అప్పుడే తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నన్నడిగితే అతను రిటైర్ మెంట్ ప్రకటించే మంచి సమయాన్ని దాటేశాడిన తెలిపాడు. ఆ డబుల్ సెంచరీ కొట్టగానే ప్రకటించేసి చేతులు దులుపుకోవాల్సిందన్నాడు. అయితే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆసీస్ ఏవిధంగా ఆడుతుందో వేచి చూడాలి.
- Tags
- David Warner