టీమిండియా హెడ్ కోచ్‌‌గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరూ ఓకే : హర్భజన్ సింగ్

by Vinod kumar |   ( Updated:2023-02-26 11:38:41.0  )
టీమిండియా హెడ్ కోచ్‌‌గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరూ ఓకే : హర్భజన్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌ను బీసీసీఐ నియమించే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్‌తో ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీ20 మ్యాచ్‌లకు కోచ్‌గా ద్రవిడ్ సెట్ అవడని.. పొట్టి ఫార్మాట్‌ను అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉన్న వారు కోచ్‌గా ఉండాలన హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

ఈ మైండ్ సెట్ ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాను హెడ్ కోచ్‌గా నియమించాలని అభిప్రాయాపడ్డాడు. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను హెడ్ కోచ్‌గా వ్యవహరించి అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ను అందిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్‌గా ఆశిష్ ఏ విధంగా రాణించడో మనం చూశామని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed