- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ సెంచరీ చేసి వారికి కొత్త తలనొప్పి తీసుకువచ్చాడు: రవిశాస్త్రి
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2022లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత కొంత కాలంగా ఫామ్ లేమి సమస్యతో పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డ ఈ రన్ మెషిన్.. ఆసియా కప్‌తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు మూడు సంవత్సరాలుగా సెంచరీ చేయని కోహ్లీ.. ఆప్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 61 బంతుల్లోనే 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో కోహ్లీపై సహచర క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విరాట్‌ను ప్రశంసించాడు.
గత కొంత కాలంగా రన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డ కోహ్లీ ఆసియా కప్ 2022లో అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. అంతేకాకుండా ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు.. సెంచరీ బాది సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తీసుకు వచ్చాడని పేర్కొన్నాడు. రానున్న టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీని ఓపెనర్‌గా బరిలోకి దించేందుకు ఇప్పుడు సెలెక్టర్లు ఆలోచించే అవకాశం ఉందని శాస్త్రి అభిప్రాయపడ్డారు. కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తే.. మిడిల్ ఆర్డర్‌లో అదనపు పేసర్‌తో పాటు అదనపు బ్యాటర్‌ని కలిగి ఉండటానికి ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించాడు.
- Tags
- Viratkohli