- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చాలా ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్నా.. రజత్ పాటిదార్‌కు పగ్గాలు అప్పగించడంపై స్పందించిన విరాట్ కోహ్లీ

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ వచ్చే సీజన్‌లో ఆర్సీబీని భారత యువ బ్యాటర్ రజత్ పాటిదార్ నడిపించనున్నాడు. తమ కొత్త కెప్టెన్‌గా పాటిదార్‌ను ఆర్సీబీ మేనేజ్‌మెంట్ గురువారం ప్రకటించింది. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. దీంతో తిరిగి విరాట్ కోహ్లీనే పగ్గాలు చేపడతాడని వార్తలు వచ్చాయి. మేనేజ్‌మెంట్ కూడా అతన్ని సంప్రదించింది. అయితే, అందుకు అతను నిరాకరించాడు. చాలా చర్చల తర్వాత ఫ్రాంచైజీ యువ బ్యాటర్ రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినట్టు టీమ్ డైరెక్టర్ మో బొబట్ వెల్లడించారు. ఆర్సీబీకి సారథ్యం వహించబోతున్న 8వ ప్లేయర్‌గా పాటిదార్ నిలిచాడు. రాహుల్ ద్రవిడ్, కెవిన్ పీటర్స్, అనిల్ కుంబ్లే, డానియల్ వెట్టోరి, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ బెంగూళూరును నడిపించారు. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్‌గా నిలువలేకపోయింది. మూడుసార్లు(2006, 2011, 2016) ఫైనల్‌కు చేరినా తుది మెట్టుపై బోల్తా పడింది. మరి, కొత్త కెప్టెన్ రజత్ పాటిదారైనా టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడో లేదో చూడాలి.
రజత్ వెన్నంటే ఉంటాం : కోహ్లీ
ఆర్సీబీ కెప్టెన్‌గా నియామమైన రజత్ పాటిదార్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే, తన వెన్నంటే ఉంటామని భరోసానిచ్చాడు. ‘రజత్‌కు ఇది కచ్చితంగా చాలా పెద్ద బాధ్యత. నేనూ చాలా ఏళ్లు సారథిగా ఉన్నా. ఆర్సీబీ నడిపించడం నీకు దగ్గిన గౌరవంగా భావిస్తున్నా. అందుకు నువ్వు కచ్చితంగా అర్హుడివి. రెండేళ్లుగా రజత్‌ను చూస్తున్నా. ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నేను, ఇతర సభ్యులు నీ వెనకాల ఉంటాం. కెప్టెన్సీ రోల్‌లో నువ్వు ముందుకు వెళ్లడానికి మద్దతు ఇస్తాం.’ అని చెప్పుకొచ్చాడు.